Sunday, May 4, 2025

నగరంలో పర్యటించనున్న అందాలభామలు

- Advertisement -
- Advertisement -

ప్రపంచ సుందరి పోటీలకు వేదిక కానున్న హైదరాబాద్‌లో పోలీసులు భద్రను కట్టుదిట్టం చేశారు. 120 దేశాలకు చెందిన అందాల భామలతో పాటు ప్రముఖులు హాజరుకానున్న నేపథ్యంలో నగరంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పోటీల్లో ఎలాంటి అప్రశృతి దోర్లకుండా ఉండేందుకు పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే కొందరు పోటీదారులు నగరానికి వచ్చారు. మే 10వ తేదీ నుంచి 31వ తేదీ వరకు వేడుకులు నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ పెంచేలా వైభవంగా వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించడంతో ఎక్కడా లోపాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. సుమారు 120దేశాలకు చెందిన పోటీదారులు హైదరాబాద్‌కు రానున్నారు. కొందమంది ఇప్పటికే నగరానికి వచ్చా వారికి కేటాయించిన హోటళ్లలో బసచేశారు.

ప్రపంచ సుందరీ పోటీదారుల చైర్‌పర్సన్, సిఈఓ జూలియా ఎవెలిన్, మిస్ వరల్డ్ అధికారిణి కెర్రీ తదితరులకు శుక్రవారం శంషాబాద్ ఎయిర్ పోర్టులో అధికారులు స్వాగతం పలికారు. మిగతా వారు దశలవారీగా నగరానికి రానున్నారు. ప్రపంచ సుందరీలతో నగరంలో హెరిటేజ్ వాక్ నిర్వహించనున్నారు. ఇందులోభాగంగా చార్మినార్, గోల్కొండ తదితర చారిత్రాత్మక ప్రదేశాలను సుందరీమణులు సందర్శించనున్నారు. నగరంలోని రామోజీ ఫిలీ సిటీ, ఆస్పత్రులు, తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సందర్శించనున్నారు. ట్యాంక్‌బండ్‌పై ప్రతి ఆదివారం ఏర్పాటు చేసే సండే ఫండే కార్నివాల్‌ను సందర్శించనున్నారు. పోటీల్లో పాల్గొనే వారు నగరంలోని పలుప్రాంతాల్లో పర్యటించనున్న నేపథ్యంలో పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే సుందరీమణులు బస చేసే స్టార్ హోటళ్ల వద్ద ఇప్పటికే పోలీసులను భద్రత కోసం మోహరించారు. ఎలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News