- Advertisement -
పుణే : లోకమాన్య తిలక్ మునిమనవడు దీపక్ తిలక్ కన్నుమూశారు. కేసరి పత్రిక సంపాదకులుగా ఉన్న దీపక్ వయస్సు 78 సంవత్సరాలు. బుధవారం తెల్లవారుజామున ఆయన పుణేలోని ఆయన నివాసంలో మృతి చెందారని కుటుంబ సభ్యులు తెలిపారు. 1881 లో తిలక్ స్థాపించిన కేసరి పత్రికకు వ్యవస్థాపక సంపాదకులుగా దీపక్ ఉన్నారు. ఆయన అంత్యక్రియలు బుధవారం మధ్యాహ్నం జరిగాయి. తిలక్ జాతీయవాద ఆలోచనలు , సంస్కరణల రక్షణలో ఆయన కొనసాగారనే పేరు తెచ్చుకున్నారు. ఆయనకు కుమారుడు, కూతురు. మనవలు, మనవరాళ్లు ఉన్నారు.
- Advertisement -