Sunday, June 15, 2025

ఎక్కిళ్ళు తగ్గాలంటే ఇలా చేయండి..

- Advertisement -
- Advertisement -

ఎక్కిళ్ళు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. దీనికి సమయం, సందర్భం ఉండదు. ఎక్కిళ్ళు వస్తే కొంచెం ఇబ్బందిగానే ఉన్నా, గొంతులో నొప్పి వస్తుంది. ఎక్కిళ్ళు పగలు వస్తే ఏం సమస్య ఉండదు. కానీ, రాత్రిపూట వస్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది. నిద్ర కూడా డిస్టర్బ్ అవుతుంది. అయితే ఎక్కిళ్ళు ఎందుకు వస్తాయి? ఎక్కిళ్లను తగ్గించుకోవడానికి ఎలాంటి చిట్కాలు అనుసరించాలో ఇప్పుడు చూద్దాం.

ఎక్కిళ్ళు ఎందుకు వస్తాయి?

ఎక్కిళ్ళు రావడానికి ఇతర కారణాలు చాలానే ఉన్నా, శరీరంలో డయాఫ్రమ్ అనే కండరంలో కలిగే ఇబ్బందుల కారణం వల్లే ఎక్కిళ్ళు వస్తాయి. శ్వాస కోసం ఉపయోగపడే డయాఫ్రమ్ అకస్మాత్తుగా సంకోచించడం వలన ఎక్కిళ్ళు వస్తాయి.

ఎక్కిళ్ళు తగ్గించుకోవడానికి అనుసరించాల్సిన చిట్కాలు..

1. ఎక్కిళ్ళు వస్తున్నప్పుడు నీటిని తాగి గొంతు దగ్గర కొన్ని సెకన్ల పాటు ఆపాలి. దీంతో ఎక్కిళ్ళు తగ్గుతాయి.
2. చల్లటి నీరు తాగడం వల్ల కూడా ఎక్కిళ్లు తగ్గుతాయి
3. ఎక్కిళ్లు త్వరగా తగ్గాలంటే ఏమైనా ఆహార పదార్థాలు తింటూ ఉండాలి.
4. చక్కెర నోట్లో వేసుకొని నెమ్మదిగా నమలడం చేయాలి.
5. ఐస్ క్యూబ్ ని నోట్లో వేసుకొని నెమ్మదిగా చెప్పనించడం వల్ల కూడా ఎక్కిళ్లు తగ్గుతాయి.
6. ఒక వెల్లుల్లి రెబ్బను తిన్న, ఒక స్పూన్ నిమ్మరసం తాగిన ఎక్కిళ్లు నుంచి ఉపశమనం పొందవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News