Wednesday, August 13, 2025

రేపు నెక్లెస్ రోడ్డులో తిరంగా ర్యాలీ

- Advertisement -
- Advertisement -

దేశ ప్రజల్లో జాతీయ భావాన్ని మరింత పెంచేందుకు బిజెపి చేపట్టిన ‘హర్ ఘర్ తిరంగా‘ (ప్రతి ఇంటా మువ్వన్నెల జెండా) కార్యక్రమంలో భాగంగా గురువారం (14న) నెక్లెస్ రోడ్డు నుంచి అంబేద్కర్ విగ్రహం వరకూ భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు ఆ పార్టీ ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి తెలిపారు.79వ స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకుని మూడు రోజులుగా దేశ వ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలు జరుగుతున్నాయని మనోహర్ రెడ్డి బుధవారం విలేఖరుల సమావేశంలో చెప్పారు. ఇదిలాఉండగా గురువారం ఉదయం 10.30 గంటలకు నెక్లెస్ రోడ్డు నుంచి ప్రారంభమయ్యే తిరంగా ర్యాలీలో పార్టీ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ఇతర ముఖ్య నాయకులూ పాల్గొంటారని ఆయన తెలిపారు.

ఈ ర్యాలీలో విద్యార్థులూ పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా 4-0 లక్షల ఇండ్లపై త్రివర్ణ పతాకాలు ఎగుర వేసేందుకు ఏర్పాట్లు చేశామని ఆయన చెప్పారు. కుల, మతాలకు, రాజకీయాలకు అతీతంగా నాయకులు, కార్యకర్తలు, ప్రజలూ ఇందులో పాల్గొనాలని ఆయన కోరారు. ఇప్పటికే రెండు రోజులుగా తిరంగా ర్యాలీలు జరుగుతున్నాయని ఇందులో తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొంటున్నారని ఆయన తెలిపారు. ప్రజలంతా ఐక్యంగా నిలబడి దేశ భక్తిని చాటాలని మనోహర్ రెడ్డి కోరారు. ప్రధాని నరేంద్ర మోడి పిలుపుతో ప్రజల మధ్య జాతీయ ఐక్యతను చాటే ఘనత దక్కిందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News