Tuesday, July 1, 2025

కారులో నిద్రపోయిన యువకులు… ఊపిరాడక ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

తిరుపతి: ఇద్దరు యువకులు పుల్‌గా మద్యం తాగి కారులో ఎసి వేసుకొని పడుకున్నారు. కారులో పెట్రోల్ అయిపోవడంతో ఇద్దరు ఊపిరాడక మృతి చెందారు. ఈ సంఘటన తిరుపతి జిల్లా తిరుచానూరు ప్రాంతం కండ్రిగ మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. గోవిందప్ప కండ్రిగ గ్రామంలో దిలీప్(25), వినయ్(20) అనే యువకులు నివసిస్తున్నారు. ఇద్దరు వరసకు అన్నదమ్ములు అవుతారు. వినయ్ టిటిడిలో కాంట్రాక్టు కార్మికుడిగా పని చేస్తుండగా దిలీప్ గ్యాస్ డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. ఇద్దరు కలిసి కారులో తిరుచానూరు వెళ్లారు.

ఇద్దరు మద్యం తాగి కారులో ఎసి వేసుకొని పడుకున్నారు. కారులో పెట్రోల్ అయిపోవడంతో ఎసి ఆగిపోయింది. కారులో ఊపిరాడక ఇద్దరు చనిపోయారు. పడుకునేటప్పుడు కారుపైన కవరు కప్పి పడుకున్నారు. దీంతో స్థానికులు ఆలస్యంగా గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారు నంబర్ డిఎల్ 9 సిటి 1765గా ఉండడంతో వాహనం ఎవరిదనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News