- Advertisement -
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్టుమెంట్లు నిండి కృష్ణ తేజా వరకు క్యూ లైన్ లో భక్తులు వేచివున్నారు. టోకేన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. ఆదివారం శ్రీవారిని 86,364 మంది భక్తులు దర్శించుకోగా 30,712 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం రూ.4.46 కోట్లుగా ఉందని టిటిడి అధికారులు వెల్లడించారు.
- Advertisement -