Friday, July 18, 2025

శోభాయమానంగా పుష్పపల్లకీ సేవ

- Advertisement -
- Advertisement -

శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప అభయం

తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం సాయంత్రం సాలకట్ల ఆణివార ఆస్థానం సందర్భంగా పుష్పపల్లకీ సేవ వైభవంగా జరిగింది. వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన పల్లకీపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు అభయమిచ్చారు. ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి చైర్మన్ బి.ఆర్.నాయుడు, బోర్డు సభ్యులు పనబాక లక్ష్మి, అదనపు ఇఒ సి.హెచ్. వెంకయ్య చౌదరి, ఆల‌య డిప్యూటీ ఇఒ లోకనాథం, పేష్కార్ రామకృష్ణ, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News