- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతిలోని గోవిందరాజుస్వామి ఆలయం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారుజామున గోవిందరాజు స్వామి ఆలయానికి సమీపంలో ఓ దుకాణంలో మంటలు చెలరేగడంతో భక్తులు పరుగులు తీశారు. దుకాణం నుంచి చలువ పందిళ్లకు మంటలు అంటుకున్నాయి. అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. షాపుల్లో ఇత్తడి సామాన్లు, బొమ్మలు దగ్ధంకావడంతో ఆస్తినష్టం జరిగినట్టు సమాచారం.
- Advertisement -