Thursday, May 8, 2025

పాకిస్థాన్ నుంచి ఎపి వ్యక్తికి బెదిరింపు కాల్

- Advertisement -
- Advertisement -

అమరావతి: తిరుపతికి చెందిన ఓ వ్యక్తికి పాకిస్థాన్ నుంచి బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. దీంతో సదరు వ్యక్తి భయబ్రాంతులకు గురయ్యాడు. తిరుపతికి చెందిన త్రిలోక్ కుమార్ అనే వ్యక్తి గాజుల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడు బుధవారం ఉదయం బైక్‌పై వెళ్తుండగా 923292527504 నంబర్ నుంచి ఫోన్ కాల్ రావడంతో లిఫ్ట్ చేశారు. త్రిలోక్ కుమార్ కుటుంబ సభ్యులు పేర్లు చెప్పడంతో పాటు…  ఏం పని చేస్తున్నారో తమకు తెలుసనని, జాగ్రత్తగా ఉండండి లేకుంటే అతడి ఇంటిపై బాంబు వేసి పేల్చేస్తాంమని ఘాటుగా ఫొన్ లో హెచ్చరించారు. ఫోన్ కాల్‌కు బయపడిపోయిన త్రిలోక్ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు కేసు నమోదు చేసి పాకిస్థాన్ నుంచి కాల్ వచ్చినట్టు గుర్తించారు.

 

Tirupati Man received threatening phone call from Pakistan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News