టిఎన్‌ఐటి (TNIT) మీడియా అవార్డులు ఫిలింఫేర్ స్థాయిలో ఎదుగుతాయని నమ్మకంగా ఉందని అవార్డుల తెలుగు జ్యూరీ ప్రభు అన్నారు. ది న్యూ ఇండియన్ టైమ్స్ విజువల్ మీడియా సీఈఓ రఘు భట్ ఆధ్వర్యం లో టిఎన్‌ఐటి మీడియా అవార్డుల వేడుకను ఆగస్టు 23న బెంగళూరులోని ప్యాలెస్ గ్రౌండ్స్‌లో గ్రాండ్‌గా నిర్వహిస్తున్నారు. ఈ మేరకు హైదరాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో మీడియాలోని ప్రభు మాట్లాడుతూ ప్రింట్, టీవీ, వెబ్, యూట్యూబ్ ప్రతి విభాగానికి ప్రత్యేకంగా అవార్డులు ఇవ్వాలన్న ఆలోచన (Filmfare awards) చాలా ప్రత్యేకమైనదని అన్నారు. రఘు భట్ మాట్లాడుతూ “ఈ అవార్డుల కోసం మలయాళం, తెలుగు, కన్నడ, తమిళ భాషల నుండి నామినేషన్లను స్వీకరిస్తున్నాం. ప్రతి మీడియా వారు అప్లికేషన్లు సమర్పించమని కోరుతున్నాం”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నటులు శుభలేఖ సుధాకర్, ఉత్తేజ్, మార్కెటింగ్ హెడ్ ఖుషీ పాల్గొన్నారు.
ఫిలింఫేర్ స్థాయికి టిఎన్‌ఐటి ఎదగాలి
- Advertisement -
- Advertisement -
- Advertisement -