Sunday, August 31, 2025

గాల్లో విమానం.. టాయిలెట్లలో సమస్య.. దీంతో గత్యంతరం లేకా..

- Advertisement -
- Advertisement -

విమానంలో ప్రయాణం అంటేనే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి.. అందులోనూ ప్రయాణికుల భద్రత, వారి ఆరోగ్యం విషయంలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి. కానీ, ఓ విమానం గాల్లో ఉండగా.. అందులోని టాయిలెట్లలో ఊహించని సమస్యులు తలెత్తింది. దీంతో ప్రయాణికులు ఎంతో అసౌకర్యానికి గురయ్యారు. చివరకు గత్యంతరం లేక బాటిళ్లలో మూత్ర విసర్జన చేశారు. ఈ ఘటన బాలి నుంచి బ్రిస్బేన్‌కు వెళ్తున్న విమానంలో చోటు చేసుకుంది. వర్జిన్ ఆస్ట్రేలియాకు (Virgin Australia) చెందిన బోయింగ్ విమానం బాలీలోని డెన్‌పస్ ఎయిర్‌పోర్ట్ నుంచి బ్రిస్బేన్‌కు బయలుదేరింది.

అయితే విమానం గాల్లో ఉండగానే.. విమానం టాయిలెట్‌లో సమస్య ఏర్పడింది. దీంతో ప్రయాణికులకు ఈ విషయం తెలియజేశారు. తొలుత పని చేస్తున్న ఒక టాయిలెట్‌ని ఉపయోగించుకున్పారు. ఆ తర్వాత కొంత సమయానికే ఆ టాయిలెట్ కూడా చెడిపోయింది. దీంతో ప్రయాణికులకు తీవ్ర అసహనానికి గురయ్యారు. విమాన సిబ్బంది ప్రయాణికులకు బాటిళ్లు ఇచ్చారు. గత్యంతరం లేక ప్రయాణికులు బాటిళ్లలో మూత్ర విసర్జన చేశారు. ఓ వృద్ధ మహిళ మూడు గంటల సమయం ఉండలేక సీటులోనే మూత్ర విసర్జన్ చేసిందని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.

ఈ ఘటనపై విమానయాన సంస్థ వర్జిన్ ఆస్ట్రేలియా (Virgin Australia) స్పందించింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణ చెప్పింది. ఇలాంటి పరిస్థితి మళ్లీ రాకుండా చూసుకుంటామని.. ప్రయాణికులకు ఫ్లైట్ క్రెడిట్‌లు అందిస్తామని పేర్కొంది. ఈ వార్త సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read : భారత్‌పై సుంకాలు.. అమెరికా బ్రాండ్ పతనమైంది

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News