ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్‌లో భాగంగా శుక్రవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 42 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ విజయంలో ఇషాన్ కిషన్ (Ishan Kishan) కీలక పాత్ర పోషించాడు. సీజన్‌లో సన్‌రైజర్స్ ఆడిన మొదటి మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిపోయిన ఇషాన్.. ఆ తర్వాత పెద్దగా పరుగులు చేయలేదు. కానీ, నిన్నటి మ్యాచ్‌లో మాత్రం 48 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సులతో 94 పరుగులు చేసి.. జట్టు భారీ స్కోర్ సాధించడంలో తన వంతు సహకారం అందించాడు. ఈ సందర్భంగా ఇషాన్‌పై మాజీ కోచ్ టామ్ మూడీ (Tom Moody) ప్రశంసల వర్షం కురిపించారు.
వచ్చే సీజన్‌లో అతన్ని టీం రిటైన్ చేసుకుంటుందేమో అని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘ఇషాన్ (Ishan Kishan) ఈ మ్యాచ్‌కి ముందు తీవ్ర ఒత్తిడిలో ఉండి ఉంటాడు. ఇప్పటివరకూ సరిగ్గా ఆడని అతను ఆర్‌సిబితో జరిగిన మ్యాచ్‌లో ఎంతో ధైర్యంగా.. అద్భుతంగా ఆడాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా.. దూకుడుగా ఆడి.. జట్టుకు భారీ స్కోర్ అందించాడు. నాకు తెలిసినంత వరకూ ఇషాన్‌ను హైదరాబాద్ యాజమాన్యం కచ్చితంగా రిటైన్ చేసుకుంటుంది’ అని మూడీ (Tom Moody) పేర్కొన్నారు.