Friday, July 18, 2025

రాజేంద్ర నగర్ లో టమాటా లారీ బోల్తా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం ఉదయం డైరీ ఫామ్ చౌరస్తా వద్ద టమాటా లోడుతో వెళుతున్న లారీ అదుపు తప్పి బోల్తా పడింది. టమాటా బాక్సులు రోడ్డు పడడంతో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్రేన్ సహాయంతో వాహనాన్ని పక్కకు తొలగించారు. రోడ్డపై పడిన టమాటాలకు ఒక వైపు కుప్పగా పోశారు. అతివేగంగాతోనే టమాటా లారీ బోల్తాపడిందని పోలీసులు వెల్లడించారు. డ్రైవర్ల స్వల్పంగా గాయపడినట్టు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News