Saturday, August 30, 2025

అటవీ నేపథ్యంలో అద్భుత ప్రేమ కథ

- Advertisement -
- Advertisement -

బబుల్‌గమ్ సినిమాతో సక్సెస్‌ఫుల్‌గా డెబ్యు చేసిన యంగ్ హీరో రోషన్ కనకాల, తన అప్ కమింగ్ మూవీ ‘మోగ్లీ 2025’లో పూర్తిగా భిన్నమైన పాత్రలో నటిస్తున్నారు. తన తొలి చిత్రం కలర్ ఫోటోతో జాతీయ అవార్డు గెలుచుకున్న దర్శకుడు సందీప్ రాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్న మోగ్లీ 2025… పోస్టర్లు, పుట్టినరోజు స్పెషల్ గ్లింప్స్‌తో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘ది వరల్డ్ ఆఫ్ మోగ్లీ’ గ్లింప్స్‌ను లాంచ్ చేశారు. గ్లింప్స్ నాని వాయిస్‌తో ప్రారంభమవుతుంది.

2025 లో అటవీ నేపథ్యంలో జరిగే ప్రేమకథను అద్భుతంగా చూపించారు. దర్శకుడు సందీప్ రాజ్ ప్రేమకథను ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్‌లో ఫ్రెష్ విజువల్స్, హత్తుకునే ఎమోషన్స్‌తో అద్భుతంగా తెరకెక్కించారు. రోషన్ కనకాల రగ్గడ్ ఇంటెన్స్ అవతార్‌లో అదరగొట్టాడు. గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ లో హీరో రోషన్ కనకాల మాట్లాడుతూ ప్రేక్షకుల కోసం ఒక అద్భుతమైన సినిమాని చేశామని అన్నా రు. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ “గ్లింప్స్ లాంచ్ చేసిన రామ్ చరణ్‌కి థాంక్యూ. వాయిస్ ఓవర్ ఇచ్చిన నానికి ధన్యవాదాలు”అని తెలియజేశారు.

Also Read : ఘనంగా హీరో విశాల్, సాయి ధన్సికల నిశ్చితార్థం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News