Wednesday, April 30, 2025

మళ్లీ పర్యాటకులతో సందడిగా పహల్‌గామ్

- Advertisement -
- Advertisement -

జమ్ముకశ్మీర్‌లోని పహల్‌గామ్‌లో ఈ నెల 22వ తేదీన ఉగ్రవాదులు పర్యాటకుల ప్రాణాలు బలిగొన్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో 26 మంది మృత్యువాతపడ్డారు. ఈ ఘటనతో భారత్, పాకిస్థాన్‌ల నడుమ ఉద్రిక్తమైన వాతావరణం నెలకొంది. అయితే ఈ దుర్ఘటన జరిగి వారం రోజులు గడవక ముందే మళ్లీ పర్యాటకులతో పహల్‌గామ్ సందడిగా మారింది. దేశ విదేశాల నుంచి పర్యాటకులు పహల్‌గామ్‌లోని ప్రకృతి అందాలను తిలకించేందుకు వస్తున్నారు. ఫోటోలు, వీడియోలు దిగుతూ.. అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. స్థానికులు కూడా దేశవిదేశాల నుంచి వచ్చే పర్యాటకులకు మంది ఆతిథ్యం ఇస్తున్నారు. దీంతో పహ‌ల్‌గామ్‌కు పునర్‌వైభవం వచ్చిందని స్థానికులు చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News