- Advertisement -
తాను స్పందించేంత స్థాయి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌కు లేదని టీపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. మంగళవారం తనను కలిసిన విలేఖరులతో ఇష్టాగోష్టిగా ఆయన మాట్లాడుతూ.. నీటి పారుదల ప్రాజెక్టుల అంశంపై బహిరంగంగా చర్చించేందుకు రావాలంటూ కెటిఆర్ సోమాజిగుడా ప్రెస్ క్లబ్‌లో కాంగ్రెస్ నాయకులకు సవాల్ విసిరి వేచి చూడడం గురించి ప్రశ్నించగా, తాను స్పందించేంత గొప్ప నాయకుడు కెటిఆర్ కాదని అన్నారు. బిఆర్‌ఎస్ అధినేత, కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిర్బంధ పాలన చేశారని మహేష్ కుమార్ విమర్శించారు. కెసిఆర్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిని ఎండగట్టేందుకు అప్పట్లో తాము ప్రయత్నిస్తే అరెస్టు చేయించారని ఆయన గుర్తు చేశారు. తమ ప్రభుత్వ హయాంలో నిర్బంధ అరెస్టులు లేవని ఆయన అన్నారు.
- Advertisement -