- Advertisement -
హైదరాబాద్: పాతబస్తీ బండ్లగూడలో అపశృతి చోటు చేసుకుంది. విద్యుత్ షాక్ తగలడంతో ఇద్దరు మృతి చెందారు. వినాయక విగ్రహం తీసుకెళ్తుండగా ట్రాక్టర్ కు హైటెన్షన్ వైర్లు తగలడంతో ప్రమాదం జరిగింది. టోని(21), వికాస్ (20), మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విద్యుత్ తీగల అధికారుల నిర్లక్ష్యానికి పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు.
- Advertisement -