వినాయక నిమజ్జనం సందర్భంగా ఈ నెల 6వ తేదీన నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వినాయక నిమజ్జనం ఊరేగింపు సమయంలో ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు ఏర్పడకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. వాహనదారులు ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయమార్గాల్లో వెళ్లాలని కోరారు. ప్రధాన ఊరేగింపు బాలపూర్‌లోని కట్టా మైసమ్మ దేవాలయం వద్ద ప్రారంభమై గుర్రం చెరువు నుండి హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి ప్రవేశిస్తుంది. కేశవగిరి చంద్రాయణగుట్ట ఫ్లై ఓవర్, ఎం.బి.ఎన్.ఆర్. ఎక్స్ రోడ్డు, – ఫలక్‌నుమా రైల్వే ఓవర్ బ్రిడ్జ్,- అలీయాబాద్,- నాగుల్చింత, – చార్మినార్, – మదీనా, – అఫ్జల్‌గంజ్, – ఎస్.ఎ. బజార్, – ఎం.జె. మార్కెట్,- అబిడ్స్ ఎక్స్ రోడ్డు, – బషీర్‌బాగ్, – లిబర్టీ జంక్షన్, – అంబేద్కర్ విగ్రహం వైపు నుండి ఎన్.టి.ఆర్. మార్గ్, పి.వి.ఎన్.ఆర్. మార్గ్ (నెక్లెస్ రోడ్)కు చేరుకుంటుంది.
– సికింద్రాబాద్ నుండి వచ్చే ఊరేగింపు సంగీత్ థియేటర్, – ప్యాట్నీ – ప్యారడైజ్ జంక్షన్, – ఎం.జి. రోడ్, – రాణిగంజ్, – కర్బలా మైదాన్, – సోనాబాయిమసీదు, – ట్యాంక్ బండ్ గుండా ఎన్.టి.ఆర్. మార్గ్, పి.వి.ఎన్.ఆర్. మార్గ్ (నెక్లెస్ రోడ్)కు చేరుకుంటుంది. చిలకలగూడ ఎక్స్ రోడ్స్ నుండి వచ్చే విగ్రహాలు గాంధీ హాస్పిటల్ -ఆర్.టి.సి. ఎక్స్ రోడ్ – నారాయణగూడ ఎక్స్ రోడ్ – హిమాయత్ నగర్ వై జంక్షన్, లిబర్టీ జంక్షన్ వద్ద ప్రధాన ఊరేగింపులో కలుస్తాయి.
– తూర్పు జోన్, ఉప్పల్ ్ర నుండి వచ్చే ఊరేగింపులు రామాంతపూర్ – శ్రీ రమణ జంక్షన్, – 6 నం. జంక్షన్, – తిలక్ నగర్ – శివం రోడ్ ,- ఓయూ ఎన్‌సిసి ,- విద్యానగర్ టి జంక్షన్, – హిందీ మహావిద్యాలయ ఎక్స్ రోడ్స్, – ఫీవర్ హాస్పిటల్, – టి.వై. మండలి, – బర్కత్‌పుర ఎక్స్ రోడ్స్, – వైఎంసిఎ నుంచి నారాయణగూడ ఎక్స్ రోడ్డుకు చేరుకుని ఆర్.టి.సి. ఎక్స్ రోడ్డు నుండి వచ్చే ఊరేగింపులో కలుస్తాయి.
– దిల్‌సుఖ్‌నగర్ నుండి వచ్చే విగ్రహాలు ఐ.ఎస్. సదన్ సైదాబాద్,- చాంద్రాయణగుట్ట వద్ద నల్గొండ ఎక్స్ రోడ్స్ వద్ద కలుస్తాయి, పెద్ద విగ్రహాలు మూసారాంబాగ్ మీదుగా అంబర్‌పేట్ వైపు వెళ్తాయి. తార్నాక వైపు నుండి వచ్చే విగ్రహాలు ఉస్మానియా యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ రోడ్, ఆడిక్‌మెట్ మీదుగా వెళ్లి విద్యానగర్ మీదుగా ఫీవర్ హాస్పిటల్ వద్ద ఊరేగింపులో కలుస్తాయి.
టోలీచౌకి, రేతిబౌలి, మెహదీపట్నం నుండి వచ్చే ఊరేగింపులు మాసబ్ ట్యాంక్, – అయోధ్య జంక్షన్,- నిరంకారి భవన్, – ద్వారకా హోటల్ జంక్షన్, – ఇక్బాల్ మినార్ మీదుగా ఎన్.టి.ఆర్. మార్గ్, పివిఎన్‌ఆర్. మార్గ్ (నెక్లెస్ రోడ్)కు చేరుకుంటాయి.
ఎర్రగడ్డ నుండి వచ్చే విగ్రహాలు ఎస్‌ఆర్ నగర్,- అమీర్‌పేట్. – పంజాగుట్ట – ఖైరతాబాద్ మీదుగా వెళ్లి మెహదీపట్నం నుండి వచ్చే ఊరేగింపులో నిరంకారి భవన్ వద్ద కలిసి ఎన్.టి.ఆర్. మార్గ్, పి.వి.ఎన్.ఆర్. మార్గ్ (నెక్లెస్ రోడ్) లకు వెళ్తాయి.
సాధారణ వాహనాలపై నిషేధం…
ఈ నెల 6వ తేదీ ఉదయం 6 గంటల నుండి 7వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఊరేగింపు కొనసాగే మార్గాల్లో వినాయక విగ్రహాలు తీసుకుని వెళ్లే వాహనాలు తప్ప ఇతర వాహనాలను అనుమతించరు. ట్రాఫిక్ ఆంక్షలు పరిస్థితిని బట్టి పొడిగించనున్నారు. ఎన్‌టిఆర్ మార్గ్, పివిఎన్‌ఆర్ మార్గ్, ట్యాంక్‌బండ్, ఖైరతాబాద్ ఫ్లైఓవర్లపై ట్రాఫిక్ ఆంక్షలు 7వ తేదీ సాయంత్రం వరకు అమలులో ఉండనున్నాయి.
పార్కింగ్ స్థలాలు…
వినాయక నిమజ్జనం చూడటానికి వచ్చే సందర్శకులు, భక్తులు వాహనాలను క్రింది ప్రదేశాలలో పార్క్ చేసి, కాలినడకన నిమజ్జనం ప్రదేశాలకు వెళ్లాలి. ఎన్‌టిఆర్ స్టేడియం, కట్టమైసమ్మ దేవాలయం, లోయర్ ట్యాంక్‌బండ్, పబ్లిక్ గార్డెన్స్,
బుద్ధ భవన్ వెనుక భాగం (నెక్లెస్ రోడ్ ఎంట్రన్స్), ఆదర్శ్ నగర్ రోడ్, బి.ఆర్.కె. భవన్, జి.హెచ్.ఎం.సి. హెడ్ ఆఫీస్ రోడ్,
ఖైరతాబాద్ జంక్షన్ వద్ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్, ఎంఎంటిఎస్ స్టేషన్ ఖైరతాబాద్.
భారీ వాహనాలు…
నిమజ్జనం తర్వాత ఖాళీ ట్రక్కులు, లారీలు ఎన్.టి.ఆర్. మార్గ్, నెక్లెస్ రోడ్ రోటరీ,- ఖైరతాబాద్ ఫ్లైఓవర్, – వి.వి.స్టాట్యూ జంక్షన్, – కె.సి.పి. జంక్షన్ నుంచి వెళ్లాలి. భారీ వాహనాలను లకిడికాపూల్, – తెలుగు తల్లి విగ్రహం లేదా మింట్ కాంపౌండ్ రోడ్ వైపు అనుమతించరు. పీపుల్స్ ప్లాజా, బేబీ పాండ్స్ వద్ద పి.వి.ఎన్.ఆర్. మార్గ్‌లో నిమజ్జనం తర్వాత లారీలు నెక్లెస్ రోడ్ రోటరీ- రైట్ టర్న్ – ఖైరతాబాద్ ఫ్లై ఓవర్,- వి.వి. స్టాట్యూ జంక్షన్, – కె.సి.పి. జంక్షన్ నుంచి వెళ్లాలి. భారీ వాణిజ్య వాహనాలు , ట్రైలర్లు, లోకల్ లారీలు నగరంలోకి ప్రవేశించడానికి అనుమతిలేదు, నగర శివారు నుంచి ఔటర్ రింగ్ రోడ్ నుంచి వెళ్లాలి.