Monday, August 25, 2025

మూడుముళ్ల గండం… కట్టుకున్నోల్లే…కడతేరుస్తున్నారు

- Advertisement -
- Advertisement -

వరుసగా జరుగుతున్న సంఘటనలు
క్షక్య పెంచుకుని పాశవికంగా హత్యలు
మనతెలంగాణ,సిటిబ్యూరోః మూడు ముళ్లు వేసిన వారే యువతులు, మహిళలను కడతేరుస్తున్నారు. అత్యంత పాశవికంగా హత్య చేసి మ్కులు ముక్కలుగా నరికి శరీర భాగాలు విసిరేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు హైదరాబాద్‌లో వరుసగా జరుగుతున్నాయి. ఈ హత్యలు చేసిన తీరును చూసి పోలీసులు షాక్‌కు గురవుతున్నారు. నిందితుల్లో ఇంత ఉన్మాదం ఉందా, అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. బాలాపూర్‌లో మాజీ ఆర్మి జవాన్ భార్యను హతమార్చడం, బాచుపల్లిలో నేపాలకు చెందిన జంట సహజీవనం చేసి తర్వాత విభేదాలు రావడంతో పాశవికంగా హత్య చేసి పడేయడం, మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో యువతిని కిరాతకంగా హత్య చేసి శరీర భాగాలను మూసిలో పడేయడం, కుత్బుల్లాపూర్‌లో భార్యను కిరాతకంగా హత్య చేయడం లాంటి సంఘటనలు వరుసగా చోటుచేసుకున్నాయి. ఈ సంఘటనలు తాము కట్టుకున్నావారిని ఎలాంటి దయాదాక్షిణ్యం లేకుండా హతమారుస్తున్నారు.

ఎప్పటి నుంచో శత్రులపై కక్ష పెంచుకుని హత్య చేసినట్లుగా తాళికట్టిన భార్యలను హతమారుస్తున్నారు. బాలాపూర్‌లో ఉంటున్న ఆర్మీ రిటైర్డ్ జవాన్ పుట్ట గురుమూర్తి, తన భార్య మాదవిని దారుణంగా హత్య చేశాడు. ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండడంతో విభేదాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఎలాగైనా భార్యను హతమార్చాలని ప్లాన్ వేసిన నిందితుడు సంక్రాంతి సెలవులను ఉపయోగించుకున్నాడు. పిల్లలను తన సోదరి ఇంటికి పంపించి భార్యను గొంతునులిమి హత్య చేశాడు. తర్వాత బాడీని ముక్కలు, ముక్కలుగా చేసి కుక్కర్‌లో ఉడకబెట్టాడు. వాటిని తీసుకుని సమీపంలోని చెరువులో పడేశాడు, తమ కూతురు మూడు రోజుల నుంచి ఫోన్‌లో మాట్లాడలేదని తల్లిదండ్రులు అనుమానించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హత్య విషయం బయటపడింది.

నిందితుడు హత్య చేసిన తీరును చూసి పోలీసులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. విచారణలో నిందితుడు పోలీసులను ముప్పుతిప్పలు పెట్టాడు, ఏ సమాచారం ఇవ్వకపోవడంతో శారీర భాగాలను కనుగొనడం కష్టంగా మారింది. విచారణ పోలీసులకు సవాల్‌గా మారడంతో ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి ఇంటి నుంచి ఆధారాలు సేకరించి కోర్టుకు సమర్పించారు. బాచుపల్లిలో జరిగిన సంఘటనలో నేపాల్‌కు చెందిన జంట సహజీవనం చేశారు, ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో నిందితుడు మహిళను హత్య చేశాడు. రెండు రోజులు ఇంట్లోనే ఉంచుకున్న నిందితుడు తర్వాత మృతదేహాన్ని సంచిలో పెట్టుకుని వచ్చి బాచుపల్లిలోని నిర్మానుష్య ప్రాంతంలో పడేశాడు.

ఈ దారుణ సంఘటనలు మరువక ముందే మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కిరాతకంగా మహేందర్‌రెడ్డి అనే యువకుడు హత్య చేశాడు. భార్యపై అనుమానం పెంచుకున్న నిందితులు వివాహం జరిగినప్పటి నుంచి గొడవపడుతున్నాడు. గొడవ జరిగిన ప్రతిసారి నిందితుడు యువతిపై విచాక్షణారహితంగా దాడి చేసేవాడు. ఐదు నెలల గర్భిణిగా ఉన్న భార్య పుట్టింటికి వెళ్తానని చెప్పడంతో ఒక్కసారిగా సైకోగా మారిన మహేందర్ రెడ్డి స్వాతిని ఇంట్లో రావడంతోనే కొట్టాడు స్పృహ కోల్పోగానే యాక్సా బ్లేడ్‌తో గొంతుకోసి హత్య చేశాడు. తర్వాత శరీరాన్ని భాగాలుగా కొసి ముక్కలను మూసిలో వేశాడు. బాడీని కోయడం సాధ్యం కాకపోవడంతో తన భార్య కన్పించలేదని నటిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితుడి మీద అనుమానం రావడంతో అదుపులోకి తీసుకుని విచారించగా దారుణాన్ని బయటపెట్టాడు.

పట్టుబడొద్దనే…పాశవికంగా…
కట్టుకున్న భార్యలను కిరాతకంగా హత్య చేస్తున్న నిందితులు పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. హత్య చేసిన తర్వాత క్లూ దొరకకుండా చేస్తే తామ నేరం నుంచి తప్పించుకోవచ్చని ప్లాన్ వేస్తున్నారు. ఓ నిందితుడు భార్యను హత్య చేసి ముక్కలు చేసి కుక్కర్‌లో ఉడికించగా, మరో నిందితుడు ముక్కలు చేసి మూసిలో పడేశాడు. ఇలా చేయడం వల్ల పోలీసులకు ఎలాంటి ఆధారాలు చిక్కవని, దీంతో తాము నిర్దోశులుగా బయటపడవచ్చని ప్లాన్ వేస్తున్నారు. కానీ పోలీసులు వీరి ఎత్తులను చిత్తు చేస్తున్నారు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితులను అరెస్టు చేసి శిక్ష పడేలా కోర్టులో సాక్షాలు సమర్పిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News