Monday, May 12, 2025

ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది మృతి

- Advertisement -
- Advertisement -

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం రాత్రి రాయ్‌పూర్‌లో ట్రక్కును డిసిఎం వాహనం ఢీకొట్టడంతో 13 మంది మరణించగా.. మరో 11 మంది గాయపడ్డారు. రాయ్‌పూర్ జిల్లాలోని రాయ్‌పూర్-బలోదబజార్ రోడ్డులోని సారగావ్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. మరణించిన వారిలో నలుగురు పిల్లలు, తొమ్మిది మంది మహిళలు ఉన్నారని చెప్పారు.

చౌతియా ఛట్టి నుండి ఒక కార్యక్రమానికి హాజరైన తర్వాత తిరిగి వస్తుండగా ఈ సంఘటన జరిగిందని రాయ్‌పూర్ ఎస్పీ లాల్ ఉమ్మద్ సింగ్ తెలిపారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న తర్వాత, పోలీసు బృందాన్ని సంఘటన స్థలానికి పంపామని, గాయపడిన వారిని రాయ్‌పూర్‌లోని డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ ఆసుపత్రికి తరలించామని రాయ్‌పూర్ జిల్లా కలెక్టర్ గౌరవ్ సింగ్ తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News