Sunday, June 29, 2025

కుప్పకూలిన శిక్షణ విమానం.. నలుగురు మృతి

- Advertisement -
- Advertisement -

విమాన ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద సంఘటన రష్యాలో చోటుచేసుకుంది. శనివారం (జూన్ 28) మాస్కో ప్రాంతంలోని కొలోమ్నా జిల్లాలో ఓ శిక్షణ విమానం కూలిపోవడంతో అందులో ఉన్న సిబ్బంది, శిక్షణ తీసుకుంటున్న వారితో సహా నలుగురు మరణించినట్లు రష్యా విపత్తు నిర్వహణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

యాకోవ్లెవ్ యాక్-18T విమానంగా అధికారులు గుర్తించారు. ఏరోబాటిక్ విన్యాసం చేస్తుండగా.. ఇంజిన్ ఫెయిల్ కావడంతో కుప్పకూలినట్లు తెలుస్తోంది. పొలంలో కూలిపోయిన తరువాత విమానంలో మంటలు చెలరేగడంతో నలుగురు మృతి చెందారు. సమాచారం అందుకున్న అత్యవసర సేవలు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా.. అందరూ చనిపోయినట్లు గుర్తించాయి. ఈ ప్రమాదానికి ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. ప్రమాదంలో నిర్లక్ష్యం లేదా విధానపరమైన ఉల్లంఘనలు జరిగాయా? అనే కోణంలో ప్రాసిక్యూటర్ కార్యాలయం దర్యాప్తును ప్రారంభించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News