Sunday, May 4, 2025

మధ్యప్రదేశ్‌లో కూలిపోయిన శిక్షణ విమానం

- Advertisement -
- Advertisement -

మధ్యప్రదేశ్ లోని గుణ జిల్లాలో ఏవియేషన్ అకాడమీకి చెందిన శిక్షణ విమానం ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు కూలిపోయింది. సుమారు 40 నిమిషాల పాటు గాలిలో ఉన్న విమానం ఇంజిన్ వైఫల్యం కారణంగా కూలినట్టు గుణ పోలీస్ స్టే ఇన్‌ఛార్జి దిలీప్ రాజోరియా వెల్లడించారు. గాయపడిన ఇద్దరు పైలట్లను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News