- Advertisement -
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న క్రేజీ మూవీ ‘ఓజి’ నుంచి మరో పవర్ఫుల్ సాంగ్ ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాలో బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. పవర్ఫుల్ ‘ఓమి’ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే పవన్ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసిన ఓమి క్యారెక్టర్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ‘ట్రాన్స్ ఆఫ్ ఓమి’ పేరుతో సాంగ్ ను మేకర్స్ విడుదల చేశారు. అద్వితీయ లిరిక్స్ అందించగా.. థమన్ సంగీత సారథ్యంలో సింగర్స్ శ్రుతి రంజని, ప్రణతి, శ్రుతిక, అద్వితీయ ఈ పాటను పాడారు. సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో పవన్ కు జోడీగా ప్రియాంక మోషన్ నటించారు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 25న గ్రాండ్ గా విడుదల కానుంది.
- Advertisement -