‘బైసైకిల్ థీవ్స్’ అనే ఇటాలియన్ నవలను ఇటలీ రచయిత బార్టొలిని 1946లో రాశాడు. ఈ నవలను 1956లో ‘సైకిల్ దొంగ’ పేరు తో శ్రీనివాస చక్రవర్తి తెలుగులోకి అనువదించగా వినోదా పబ్లికేషన్స్, విజయవాడ వారు మొదట ముద్రించారు. ‘నా కొత్త సైకిలు నిన్న పోయింది!’ అన్న వాక్యంతో మొదలయ్యే ఈ నవల అప్పటి నుండి పునర్ముద్రణ కాలేదు. ఇప్పుడు 2025లో అంటే 69 ఏళ్ల తరవాత ఈ నవల అనిల్ బత్తుల పబ్లికేషన్స్ తరుపున పునర్ముద్రణ అవుతుంది. ఇక నవల కథాంశం విషయానికి వస్తే.. అవి మొదటి ప్రపంచ యుద్ధ రోజులు, ఇటలిలో ఆర్థిక మాంధ్యం, పేదరికం, అవినీతి, లంచగొండితనం, వ్యభిచారం రాజ్యమేలుతుంటాయి. నవల కథానాయకుడు స్వతహాగా కవి, చిత్రకారుడు. అతను తన కొత్త సైకిలును పొగొట్టుకుంటాడు.
ఆ సైకిలు ను వెతికే క్రమంలో మనకు ఇటలీలోని సామాజిక, ఆర్థిక, రాజకీయ చిత్రాన్ని చూపిస్తాడు. మానవ జీవితంలోని, మనస్థత్వాల్లోని నగ్నత్వాన్ని, పోలీ సు వ్యవస్థలోని అవినీతిని, దాని మూలాల్నీ బోల్డ్ గా చిత్రిస్తాడు. ఈ ఇటాలియన్ నవల ఆధారంగా 1948లో విక్టోరియా డిసికా దర్శకత్వంలో ‘బైసైకిల్ థీవ్స్’ అనే ఇటాలియన్ సినిమా వచ్చింది. ఈ సినిమా ఒక క్లాసిక్ సినిమా. మన తెలుగు రచయిత కేశవరెడ్దికి, బెంగాలీ దర్శకుడు సత్యజిత్ రే కి కూడా ఈ సినిమా చాలా ఇష్టం. సినిమా కథాం శం విషయానికి వస్తే, ఒక కుటుంబ పెద్ద ఇంట్లో సామా న్లు అమ్మేసి సైకిల్ కొంటాడు. ఆ సైకి ల్ వల్లే చిన్న ఉద్యో గం వస్తుంది. ఆ సైకిల్‌ని పార్క్ చేసి సినిమా పోస్టర్లు అంటిస్తుంటే ఒక దొంగ ఆ సైకిల్ను దొంగిలిస్తాడు.
ఉద్యోగం ఉంటేనే కుటుంబానికి తిండి దొరికుతుంది. ఉద్యో గం కావాలంటే సైకిల్ తప్పక ఉండాలి. ఆ కథానాయకుడు తన కొడుకు (సుమారు ఎనిమిదేళ్ళ బాలుడు)తో కలిసి ఆ సై కిల్ కోసం ఇటలీ మొత్తం వెతుకుతుంటాడు. ఆ సైకిల్ దొరకదు. చివరికి ఇతను తప్పని ప రిస్థితుల్లో వేరేవాళ్ల సైకిల్ దొంగిలించబోయి పోలీసుల చేతిలో అరెస్ట్ అవుతాడు. అప్పుడు ఆ బాలుడు తండ్రిని చూసి విపరీతంగా ఏడుస్తాడు. ఇదీ సినిమా కథ. నవలకు సినిమాకు కథాంశం విషయంలో పోలిక లేనప్పటికీ నవల చదవడం, సినిమా చూడటం.. రెండూ బాగుంటాయి. రెండూ మనకు మంచి అనుభూతిని ఇస్తాయి. ఈ సినిమాను ఇంగ్లీషు సబ్ టైటిల్స్‌తో యూట్యూబ్‌లో ఉచితంగా చూడవచ్చు. ఈ అనువాద నవలను త్వరలో నవోదయ బుక్‌హౌస్, కాచిగూడ,హైదరాబాద్‌లో కొనుక్కుని చదువుకోవచ్చు.
- నవోదయ బుక్‌హౌస్, 9000413413
సినిమా చూడటానికి లింకు:
అనిల్ బత్తుల పబ్లికేషన్స్