Monday, July 14, 2025

అనువాదం ఒక సృజనాత్మక ప్రక్రియ

- Advertisement -
- Advertisement -

మెహఫిల్ ఒక నూతన శీర్షిక తర్జుమాను పాఠకుల కోసం పరిచయం చేయా లని భావించింది. వివిధ ప్రపంచ భాషలలో వచ్చి న సాహిత్యం గురించి తెలుసుకోవడం, చదవడం మన దృష్టిని విశాలం చేస్తుంది. వివిధ దేశాల సంస్కృతులు, జీవన విధానాలు, భౌగోళిక పరిస్థి తులు, మానవ సంబంధాలు, ఉద్వేగాలు మనం అర్ధం చేసుకోవడానికి సాధ్యమవుతుంది. ప్రపంచ సాహిత్య అధ్యయనం మనుషులలో విశ్వమానవ తత్వానికి వారధిగా నిలుస్తుంది. ఇక నుండి అనేక ప్రపంచ భాషల నుండి ఇంగ్లీష్‌లోకి అనువాదాలు చేస్తున్న ప్రసిద్ధ అను వాదకులు ఈ తర్జుమా శీర్షిక ద్వారా పరిచయం అవుతారు. దీనితో పాటు అదనంగా ఆయా భాష ల్లోని పుస్తకాల పరిచయం కూడా ఉంటుంది. ఇం దులో మొదటగా పరిచయం కాబోతున్నది, ప్ర ఖ్యాత అనువాదకులు డేమియన్ సిరల్స్ పుస్తకం పేరు ‘The Philosophy of Translation’- మెహఫిల్ టీం

డేమియన్ సిరల్స్ జర్మన్, నార్వేజియన్, ఫ్రెంచ్, డచ్ భాషల నుంచి సాహితీ అనువాదాలు చేస్తారు. అరవైకి పైగా పుస్తకాలు ఇప్పటిదాకా ఆయన అనువాదం చేసారు. ప్రస్తుతం అమెరికాలో నివసిస్తున్నారు. 2023లో నోబెల్ బహుమతి గెలుచుకున్న నార్వే జియన్ రచయిత యాన్‌ఫోసా పుస్తకాలు పదికి పైగా అనువదించారు. ఆ అనువాదాలు గుగెన్ హైమ్ కల్మన్ సెంటర్ ఫెలోషిప్, అలాగే ఊవీ జాన్సన్ ‘ఆనివెర్సరీస్’ జర్మనీ నుంచి ఇంగ్లీష్‌లోకి అనువదించినందుకు ఇంగ్లాండ్, అమెరికాలో డేమియన్ సిరల్స్ అనేక బహుమతులు గెలుచుకున్నారు. అయన అనువాదకులే కాక రచయిత, కవి కూడా. అనువాదాల మీద ఇంగ్లీష్‌లో చాలా పుస్తకాలు వచ్చాయి. వీటిల్లో ట్రాన్స్‌లేషన్ థియరీ మీద యూనివర్సిటీ ప్రొఫెసర్లు రాసిన పుస్తకాలు ఎక్కు వ. ఇవి కాక కొంతమంది ప్రసిద్ధ అనువాదకులు కూడా వాళ్ల అనుభవాలను పుస్తకాలుగా రాసారు. ఉదాహరణకు డేనీహాన్ రాసిన ‘క్యాచింగ్ ఫైర్’ (Catching Fire) గురించి మనం చెప్పుకోవచ్చు. పోర్చుగీస్ నుంచి ఆయన ఒక పుస్తకం ఎలా అనువాదం చేశారో, అనువాద సమస్యలను ఆయ న ఎలా అధిగమించారో చాలా ఆసక్తికరంగా మన కు చెప్తారు. అలానే అనువాదకులు ప్రధాన పాత్రధారులుగా కాల్పనిక సాహిత్యం కూడా ఇంగ్లీష్‌లో కొంత వచ్చింది.

కాగా అనువాదం అనేది రచనలానే ఒక సృజనాత్మక ప్రక్రియ అంటూ అనేక ఉదాహరణలతో అత్యంత ఆసక్తికరంగా రాసిన అరుదైన పుస్తకం ‘The Philosophy of Translation’. ఈ పుస్త కం క్రిందటి సంవత్సరం విడుదలై విశేషంగా ఆదరణ పొందింది. అనేక యూనివర్సిటీల్లో పాఠ్యాంశంగా ఈ పుస్తకాన్ని చేర్చారు. అనువా దం అనేది ఒక భాషలో రాసిన పదాలను గంపగుత్తగా వేరొక భాషలోకి ఉన్నది ఉన్నట్టుగా మార్చడం అనుకుంటే, అందు కు సృజన అన్నదే అవసరం లేదు అంటూ పుస్తకాన్ని మొదలుపెడతారు డేమియన్. మొదటి నాలుగు అధ్యాయా లు అనువాదంలో ఉన్న సృజనాత్మకతను వివరిస్తూ వెళితే, చివరి నాలుగు అధ్యాయాల్లో తాను అనువదించిన, వేరే ప్రసిద్ధ అనువాదకులు అనువదించిన పుస్తకాల్లోంచి అనేక ఉదాహరణలు ఇస్తారు రచయిత. రచనలో తమ అనుభవాలకు, ఊహలకు, పాత్రలను, సంభాషణలు కల్పించి రాస్తే అనువాదంలో ఒక భాషలో చదివి అర్థం చేసుకుని ఇంకో భాషలో రాయాల్సిన అవసరం ఉంటుంది. ఇందులో రాయ డం అనేది ఎంత ముఖ్యమో, తీవ్రమైన పరిశీలనా శక్తితో చదవడం కూడా అంతే అవసరం. ఒక సా మాన్య పాఠకుడిగా చదవడానికి, అనువాదకుడిగా చదవడానికి ఉన్న తేడాలను డేమియన్ సిరల్స్ వివరిస్తారు.

కేవలం ఒక భాషలో ఉన్న పదాలకు వేరొక భాషలో సమానార్థం వచ్చే పదాలను వెతుక్కోడానికి పక్కన ఒక నిఘంటువు పెట్టుకోగలిగితే సరిపోతుంది. అనువాదకుడనే వాడి అవసరం ఉండదు. అన్నిటికంటే ముఖ్యంగా, అనువదించినప్పుడు వాక్య నిర్మాణంలో కానీ, పదాల వాడకంలో కానీ కృత్రిమంగా ఉందనిపిస్తే ఆ అనువాదం విఫలమైనట్టే. ఉదాహరణకు వేరే భాషలోంచి ఇంగ్లీష్‌లోకి అనువదిస్తే ఇంగ్లీష్ రచనలా ఉండడం (నామవాచకాలు, కథా నేపథ్యం వేరే ప్రాంతానిదైనా) అనువాదానికి ఉండాల్సిన ప్రాథమిక లక్షణం, అనువాదకుల కనీస బాధ్యత. అనువాదంలో అర్థంతో పాటు అనుభూతి ముఖ్యం. ఆ అనుభూతి పదాలను కూర్చిన పద్ధతి వల్ల కావచ్చు. రచయిత శైలి వల్ల కావచ్చు. ‘ప్రాస’లా శబ్ద ప్రధానమైనది కూడా కావచ్చు. వీటన్నింటినీ గమనిస్తూ, అర్థంతో పాటు అనుభూతిని అనువాదకుడు అనువదించాల్సిన అవసరం ఉంటుంది. ఈ పుస్తకంలో అనువాదంలో సృజన ఎంత అవసరమో చెబుతూ అనేక ఆసక్తికరమైన ఉదాహరణలు ఇస్తారు రచయిత. మూడున్న ర దశాబ్దాల అనువాద అనుభవంతో ఈయన 2024లో రాసిన పుస్తకం ‘The Philosophy of Translation’ విశేష ప్రాచుర్యాన్ని పొంది, ఇప్పటికే అనేక భాషల్లోకి అనువాదం అయ్యింది. ఈ పుస్తకం ఏల్ యూనివర్సిటీ (Yale University) ప్రచురించింది. అనువాద ప్రక్రియలో నిమగ్నమైన, ఆసక్తి కలిగిన వారంతా తప్పకుండా చదవాల్సిన ఈ పుస్తకం అమెజాన్‌లో దొరుకుతుంది.
హర్షణీయం బృందం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News