అమరావతి: ఓ యువకుడిని ఇద్దరు యువతులు ప్రేమించారు. ఇద్దరు యువతుల మధ్య గొడవ ఒకరి ప్రాణం తీసింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా కేంద్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. అరుణ్ కుమార్ అనే యువకుడు, ప్రతిభాబారతి అనే యువతి గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ప్రతిభాబారతి అనంతపురం జిల్లా కేంద్రంలోని సాయినగర్‌లో దీపు బ్లడ్ బ్యాంకులో పని చేస్తున్నారు. అక్కడి స్వాతి అనే యువతి ప్రతిభాభారతికి పరిచయమైంది. అరుణ్, ప్రతిభాతో అన్న, వదిన అంటూ స్వాతి కలిసిపోయేది. ప్రతిభాకు తెలియకుండా స్వాతితో అరుణ్ ప్రేమాయణం నడిపించాడు. ఈ విషయం ప్రతిభాకు తెలియడంతో స్వాతికి ఫోన్ చేసి బండ బూతులు తిట్టడంతో పాటు నీ అంతు చూస్తామని బెదిరించింది. స్వాతి భయంతో తన ఉంటున్న రూమ్‌లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ప్రైవేటు వసతి గృహ నిర్వహకులు స్పందించి ఆమెను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చనిపోయిందని వైద్యులు తెలిపారు.
Also Read: చిన్నారి ప్రాణం తీసిన పురుగు