Tuesday, May 13, 2025

భూమి కోసం కలెక్టరేట్ వరకు.. 30 కి.మీ గిరిజన దంపతుల పాదయాత్ర

- Advertisement -
- Advertisement -

కబ్జాకు గురైన భూమిని సర్వే చేసి అప్పగించడంలో అధికారులు నిర్లక్షం వహించారంటూ గిరిజన దంపతులు సోమవారం తమ గ్రామం నుంచి కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేపట్టారు. వివరాలలోకి వెళితే..నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలంలోని మెట్టుపల్లి గ్రామపంచాయతి ఇప్పలపల్లి తండాకు చెందిన రాత్లావత్ రవి కుటుంబానికి సర్వే నెంబర్‌ 253 లో మూడు ఎకరాల 20 గుంటల వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమిని చుట్టుపక్కల పొలాల వారు కబ్జా చేసి సాగు చేసుకుంటున్నారని గత నాలుగేళ్లుగా అనేకమార్లు తహసిల్దార్, ఆర్‌డిఒ కార్యాలయాల చుట్టూ, సర్వేయర్లు చుట్టూ తిరిగి దరఖాస్తులు చేసినా ఫలితం లేకపోయిందని బాధితులు వాపోయారు. అధికారుల చుట్టూ ఎంత తిరిగినా తమ పని జరగడం లేదని భావించి సోమవారం ఉదయం భార్య గీతతో కలిసి ప్లకార్డులు చేతబట్టి రవి నాయక్ కాలినడకన దాదాపు 30 కిలోమీటర్ల దూరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని ప్రజావాణిలో ఈ మేరకు ఫిర్యాదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News