- Advertisement -
ఓ గిరిజనుడిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన చర్ల మండల పరిధిలో చోటుచేసుకుంది. రాజయ్యనగర్ మడకం భద్రయ్య (40)అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం అర్థరాత్రి దారుణంగా హత్య చేశారు. కత్తులతో అతడిపై విరుచుకుపడ్డారు. అడ్డువచ్చిన భార్యపై సైతం దాడికి పాల్పడ్డారు.రక్తపు మడుగులో పడి ఉన్న అతడిని చూసి భార్య కేకలు వెయ్యడంతో దుండగులు అక్కడి నుండి పారిపోయారు. స్థానికులు భద్రాచలం ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తున్న క్రమంలో మార్గం మధ్యలో అతడు మృతి చెందాడు.విషయం తెలుసుకున్న సిఐ రాజువర్మ,ఎస్సైతో అక్కడికి చేరుకుని హత్య జరిగిన తీరుపై ఆరా తీశారు..కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అయితే గతంలో సైతం ఇదే గ్రామంలో రెండు ఇలాంటి సంఘటనలే జరగడం గమనార్హం.
- Advertisement -