Saturday, May 24, 2025

‘స్పిరిట్‌’ నుంచి క్రేజీ అప్డేట్.. ప్రభాస్ కు జోడీగా హాట్ బ్యూటీ

- Advertisement -
- Advertisement -

సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్‌.. ‘స్పిరిట్‌’ అనే మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే. పవర్ ఫుల్, నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ స్టోరీతో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు సందీప్ ఇప్పటికే వెల్లడించారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ మూవీ ప్రకటించినప్పటి నుంచి ఇందులో ప్రభాస్ సరసన నటించే హీరోయిన్ పై చాలా వార్తలు వచ్చాయి. పలువురు బాలీవుడ్ హీరోయిన్స్ పేర్లు బయటకు వచ్చాయి. తాజాగా ఈ సినిమాలో నటించే హీరోయిన్ పేరును సందీప్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఇందులో ప్రభాస్ కు జోడీగా యానిమాల్ ఫేం హాట్ బ్యూటీ త్రిప్తి దిమ్రీని ఎంపిక చేసినట్లు తెలిపారు.అలాగే, ఈ మూవీని తొమ్మిది భాషల్లో రూపొందించనున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే, ముందు సందీప్ రెడ్డి వంగా.. దీపికా పడుకొనేను సంప్రదించినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. కానీ, ఆమె పలు కండీషన్స్ పెట్టడంతో సందీప్.. దీపికాను రిజెక్ట్ చేసినట్లు టాలీవుడ్ సర్కిల్లో టాక్ వినిపించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News