- Advertisement -
మెగాస్టార్ చిరంజీవి, హీరోయిన్ త్రిష కాంబినేషన్ తెరకెక్కుతున్న చిత్రం ‘విశ్వంభర’. ఈ ప్రాజెక్టు సోషియో ఫాంటసీ నేపథ్యంలో పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న సంగతి తెలసిందే. ఆదివారం త్రిష పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ శుభాకాంక్షలు తెలుపుతూ.. మూవీలో ఆమె పాత్రను పరిచయం చేశారు. ఇందులో ఆమె అవనిగా నటిస్తున్నట్లు తెలిపారు. అంతేకాదు, చీరకట్టులో మెరిసిపోతూ నవ్వులు చిందిస్తున్న త్రిష ఫస్ట్ లుక్ ను రివీల్ చేశారు.
అత్యంత భారీ బడ్జెట్ తో యూవీ క్రియేషన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు. అస్కార్ విజేత ఎం ఎం కీరవాణి ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు. కాగా, చిరంజీవి-త్రిష కాంబినేషన్ లో స్టాలిన్ వచ్చిన సంగతి తెలిసిందే.
- Advertisement -