Wednesday, July 16, 2025

బిసిసిఐ ఉపాధ్యక్షడు రాజీవ్ శుక్లాపై ట్రోల్స్.. ఎందుకంటే..

- Advertisement -
- Advertisement -

ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత పురుష, మహిళల జట్ల సభ్యులు మంగళశారం బ్రిటన్ రాజు ప్రిన్స్ చార్లెస్-3ను కలిసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బిసిసిఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా (Rajeev Shukla) ఆయనకి ఓ కానుక ఇచ్చారు. దీంతో రాజీవ్ శుక్లాపై ట్రోల్స్ వెల్లువెత్తుతున్నాయి. ఎందుకంటే..

రాజీవ్ శుక్లా (Rajeev Shukla) 1947లో దేశ విభజన సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలపై ఓ పుస్తకం రాశారు. ‘స్కార్స్ ఆఫ్ 1947: రియల్ పార్టీషన్ స్టోరీస్’ అనేది ఆ పుస్తకం టైటిల్. ఈ పుస్తకాన్ని చార్లెస్-3కి ఆయన బహుమతిగా ఇచ్చారు. అంతేకాక ఆ ఫోటోని సోషల్‌మీడియాలో షేర్ చేస్తూ.. ఆ పుస్తకాన్ని చదివేందుకు చార్లెస్-3 ఎంతో ఆసక్తి చూపించారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

కొందరు నెటిజన్లు రాజీవ్ శుక్లాపై ట్రోల్స్ వేస్తున్నారు. ‘‘ఆ కానుక బదులుగా మన కోహినూర్‌ని తీసుకురండి’’ అని కొందరు ట్రోల్ చేయగా.. ‘‘బ్రిటిషర్లు మిగిల్చిన మరకలను ఆ దేశ యువరాకే చూపిస్తున్నారా.? ఇది చరిత్రలో గొప్ప మీమ్‌గా మిగిలిపోతుంది’’ అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News