Thursday, July 31, 2025

భారత్ కు ట్రంప్ షాక్.. ఇండియా వస్తువులపై 25% అదనపు సుంకాలు..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ కు బిగ్ షాకిచ్చాడు. ఇకనుంచి భారత వస్తువులపై 25 శాతం సుంకాలు విధించనున్నట్లు బుధవారం ట్రంప్ ప్రకటించాడు. ఆగస్టు 1 నుండి ఇవి అమలులోకి రానున్నట్లు తెలపాడు. రష్యాతో భారత్ చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తున్నందుకే ఈ అదనపు సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ చెప్పాడు.

ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫామ్‌లో ఈ ప్రకటన చేస్తూ.. “గుర్తుంచుకోండి, భారత్ మా మిత్ర దేశం అయినప్పటికీ, మేము సంవత్సరాలుగా వారితో చాలా తక్కువ వ్యాపారం చేశాం. ఎందుకంటే వారి సుంకాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యధికంగా సుంకాలు విధించే దేశాల్లో భారత్ ఒకటి. ఏ దేశంలో లేని విధంగా కఠినమైన ద్రవ్యేతర వాణిజ్య అడ్డంకులను భారత్ కలిగి ఉంది. అలాగే, భారత్ ఎల్లప్పుడూ తమ సైనిక పరికరాలను ఎక్కువగా రష్యా నుండి కొనుగోలు చేసింది. ఉక్రెయిన్‌పై దాడులు ఆపాలని అందరూ కోరుకుంటుండగా.. చైనాతో పాటు భారత్.. రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్నాయి. అందుకే భారత్ పై 25 శాతం అదనపు సుంకాలు విధిస్తున్నాం” అని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News