న్యూఢిల్లీ : చైనా, భారత్, రష్యా మధ్య చిగురించిన మైత్రి పట్ల అమెరికా అధ్యక్షుడు డోనా ల్డ్ ట్రంప్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సోష ల్ మీడియా వేదికగా ట్రూత్‌లో ట్రంప్ ఈ దే శాల మైత్రిపై వ్యాఖ్యానిస్తూ, చీకటి చైనాకు భారతదేశం, రష్యాలను కోల్పోయినట్లు కన్పిస్తోందని వ్యంగ్యంగా పేర్కొన్నారు. మూడు దేశాలకు సంపన్న భవిష్యత్ సమకూరాలని కోరుకుంటునేనట్లు ట్రంప్ పేర్కొన్నారు. చైనా లోని టియాంజిన్‌లో జరిగిన షాంఘై సహకార శిఖరాగ్ర సమావేశంలో ఈ మధ్య చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, భారత ప్రధాని మోదీ, రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ లకు ఆతి థ్యం ఇచ్చారు. ఈ మూడు దేశాధినేతల కలయికపై ట్రంప్ స్పందిస్తూ, వారు అందరికీ, సుదీర్ఘమైన, సంపన్నమైన భవిష్యత్ ఉండాలని కోరుకుంటున్నానని ట్రూత్ లో పోస్ట్ పె ట్టారు. దీంతో భారతదేశం, రష్యా, చైనా మ ధ్య సంబంధాలు బలపడుతున్నాయని ట్రంప్ బహిరంగంగా అంగీకరించినట్లు ఈ వ్యాఖ్య లు చెబుతున్నాయి. ఉక్రెయిన్‌యుద్ధం, ప్ర పంచ వాణిజ్యంలో ట్రంప్ విధానాల ను విభేదిస్తున్న మూడు దేశాల అధినేతలు వివిధ స్థా యిలలో ఇంధనం నుంచి, భద్రత వరకూ పలు రంగాలలో సహకారంపై బహిరంగంగా చర్చించిడం గమనార్హం.
దశాబ్దాలుగా అమెరికా భారతదేశాన్ని బలమైన శక్తిగా ఎదుగుతున్న చైనా ను దీటుగా ఎదుర్కొనే మిత్రదేశంగా భావిస్తూ వచ్చింది. అమెరికాలో రిపబ్లికన్లు అధికారంలో ఉన్నా, అటు డెమోక్రటిక్ లు అధికారంలో ఉన్నా ఆయా ప్రభుత్వాలు భారతదేశాన్ని వ్యూహాత్మక భాగస్వామిగా భావించి పెట్టుబడులు పెడుతూ వచ్చాయి. అమెరికా అధ్యక్షుడుగా మొదటి సారి పదవీ కాలంలో ట్రంప్ కూడా భారతదేశాన్ని కీలక మిత్రదేశంగా అక్కున చేర్చుకున్నాడు. 2019లో హూస్టన్ లో జరిగిన హౌడీ మోడీ ర్యాలీలో ట్రంప్, మోదీ చెట్టపట్టాలు వేసుకుని కన్పించారు. జపాన్, ఆస్ట్రేలియా తో పాటు భారతదేశాన్ని కలుపుకుని అమెరికా చతుర్భుజ భద్రతా చర్చలు (క్వాడ్)ను పునరుద్ధరించారు కూడా. అయినా ఇటీవల కొన్ని పరిణామాలతో సంబంధాలు బెడిసికొట్టాయి. రష్యా నుంచి భారతదేశం చమురు దిగుమతి చేసుకోవడాన్ని ట్రంప్ జీర్ణించుకోలేక పోయారు.
దీంతో భారతదేశం దిగుమతులపై భారీ సుంకాలు విధించడం తో సంబంధాలు మరింత క్షీణించాయని నిపుణులు పేర్కొంటున్నారు. ట్రంప్ రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి భారతీయ వస్తువులపై ఏకంగా 50 శాతం సుంకాలను విధించారు. రష్యా నుంచి చమురు దిగుమతులు చేసుకుంటుందన్న లక్ష్యంతో 25 శాతం, పరస్పర సుంకాలు, అదనంగా 25 శాతం సుంకాలు విధించారు. ప్రపంచంలో మరో ఏ వాణిజ్య భాగస్వామి పట్ల ఇంత కఠినంగా వ్యవహరించకపోవడం గమనార్హం. ఇంధన వాణిజ్యం భారత అమెరికా దేశాల మధ్య ప్రధానంగా చిచ్చురేపింది. రష్యానుంచి చమురు చౌకగా కొనుగోలు చేయడం ద్వారా ఉక్రెయిన్ పై యుద్ధంలో రష్యాకు నిధులు సమకూరుస్తోందని ట్రంప్ ఆరోపించారు. భారత్ పై కక్ష కట్టిన ట్రంప్, రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న చైనా, యురోపియన్ దేశాల పట్ల మరో విధంగా ఎందుకు ప్రవర్తిస్తున్నదన్న భారత్ ప్రశ్నకు సమాధానం చెప్పే స్థితిలో ట్రంప్ లేకపోవడం విశేషం.