న్యూయార్క్ : భారత్ సహా కొన్ని దేశాలు అమెరికాను భారీ స్థాయి సుంకాతో చంపేస్తున్నాయని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. అమెరికాను, దేశ ప్రయోజనాలను భారత్ విధ్వంసం చేస్తోందని విమర్శించారు. అమెరికా భారీ సుంకాలతో ఇప్పుడు భారత్ దిగివచ్చిందని, అమెరికా సరుకులపై ఎటువంటి టారీఫ్‌కు దిగబోమని ఇప్పుడు ప్రతిపాదించిందని ట్రంప్ ది స్కాట్ జెన్నింగ్స్ రేడియో షోకు ఇచ్చిన ఫోన్ ఇంటర్వూలో తెలిపారు. ప్రపంచ దేశాల సుంకాలపై తనకు పూర్తిగా అవగావహన ఉందని , తమ భారీ స్థాయి సుంకాలతో ఇకపై సుంకాలు పడకుండా చేస్తామని రాజీకి వచ్చారని చెప్పారు . భారత్ నుంచి వెలువడ్డ ప్రతిపాదన గురించి ఆయన అధికారికంగా వెల్లడించలేదు. భారత్ ఇంతకాలం తమ టారీఫ్‌లతో అమెరికాను చంపే స్తూ వచ్చింది. సుంకాల గురించే భారత్ అమెరికా మధ్య ఉద్రిక్తత నెలకొంది. పలు రకాల అంతర్జాతీయ పరిణామాలకు దారితీసింది. వ్యాపార వాణిజ్య సంబంధాలపై భారత్ తమతో కయ్యానికి దిగుతోంది. భారత్ అమెరికాపై అత్యధిక సుంకాల కు దిగింది. ఇక చైనా , బ్రెజిల్ తమపై సుంకాల దాడిని తీవ్ర తరం చేశాయి.
ఇతర దేశాలతో పోలిస్తే తనకు ఈ టారీఫ్‌లపై బాగా అవగావహన ఉందన్నారు. తాము విధించిన సుంకాలతో ఇప్పుడు భారత్ దారికి వచ్చిందని ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికా టారీఫ్‌లు విధించకుండా ఉంటే ఆయా దేశాలు బాగా పుంజుకునేవి. ఇప్పుడు తమ టారీఫ్‌లతో మనం ఆర్థికంగా బలోపేతం అవుతున్నామని కూడా తమ సుంకాలను ట్రంప్ సమర్థించుకున్నారు. తమ సుంకాలు చెల్లనేరవని అమెరికా ఫెడరల్ కోర్టు చట్ట వ్యతిరేకం అని తెలిపింది. దీనిపై ట్రంప్ స్పందించారు. లాభాలు పొందుతున్న కొన్ని దేశాల తరఫున ఈ కోర్టు కేసు దాఖలు అయిందని ట్రంప్ వ్యాఖ్యానించారు. అంతకు ముందు వైట్‌హౌస్‌లో మాట్లాడిన ట్రంప్ భారత్‌తో సంబంధాలు బాగానే ఉంటాయని స్పష్టం చేశారు. అయితే అమెరికా ఉత్పత్తులపై ఇండియా భారీ సుంకాలతో అక్కడ తమ వాహనాలు ఇతరత్రా సరుకులు అమ్ముడుకావడం లేదని తెలిపారు.
సుంకాలు తప్పితే అంతా బాగానే ఉంది
భారత్ అమెరికా సం బంథాలుబాగున్నాయని అమెరికా అ ధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ చెప్పారు. సుంకాల వద్దనే సమస్య తలెత్తుతోందన్నారు. చాలా కాలంగా భారత్ అమెరికాపై భారీ సుంకాలు విధిస్తోంది. ఇదంతా ఏకపక్షంగా ఉంటూ వచ్చింది. తాను అధికారంలోకి వచ్చిన తరువాత తాను పరిస్థితిని మార్చినట్లు ట్రంప్ బు ధవారం వైట్‌హౌస్‌లో విలేకరుల సమావేశంలో తెలిపారు. భారత్ నుంచి భారీ సుంకాలు ఉన్నప్పటకీ తాము పరిస్థితిలో మార్పు తెచ్చేందుకు యత్నిస్తున్నామని చెప్పారు భారత్‌పై విధించిన భారీ సుంకాలలో కొన్నిటికి ఉపసహరించుకునే వీలుందా? అనే ప్రశ్నకు ట్రప్ సమాధానం ఇచ్చారు. ప్రపంచం లో ఎక్కడా లేని విధంగా భారత్ అమెరికాపై భారీ సుంకాలు విధిస్తోంది. ఇప్పటి వరకూ భారత్‌పై సుంకాలు వేయకపోవడం వెర్రితనం అవుతోందని అన్నారు.