Thursday, September 4, 2025

భారత్ ఐటిపై ట్రంప్ కన్ను?

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : భారతీయ వస్తువులపై అధికసుంకా లు విధించినా, ఆ దేశం లొంగిరాకపోవడం తో,ఇండియాను శిక్షించేందుకు అమెరికా అ ధ్యక్షుడు డోనాల్ట్ ట్రంప్ కొత్త కుట్రలకు తెరతీస్తున్నట్లు కన్పిస్తోంది. ఐటీ సేవలపై సుంకాల విధింపు, విదేశీ రిమోట్ కార్మికులు సోర్స్ వ్యా పారాల పై ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కన్నుపడి న ట్లు కన్పిస్తోంది. హెచ్ -1 బి వీసా వ్యవస్థను చ క్కదిద్దే ప్రతిపాదనలు, గ్రీన్ కార్డ్ హోల్టర్లు, తా త్కాలిక వీసా కార్మికులపై ఇప్పటికే పెరిగిన లె వీలకు తోడుగా మరో పద్ధతి అన్వేషిస్తున్నారు. అమెరికా సిలికాన్ వ్యాలీ, ఐటీ బూమ్ సాధించడంలో కీలక పాత్రవహించిన ఇంజనీర్లు, కో డర్లు, విద్యార్థులతో సహా కీలకమైన మానవవనరులను టార్గెట్ చేసే ఆలోచనలో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఉంది. ఈ చర్య భారతదేశపు అత్యం త ముఖ్యమైన ఎగుమతి ఇంజిన్‌కు కళ్లెం వేసే విసృ్తతమైన కుట్రను సూచిస్తోంది. తదుపరి లక్ష్యం అన్ని అవుట్ సోర్సింగ్ లకు సుంకాలు విధించడం, విదేశాల నుంచి వచ్చే వస్తువుల మాదిరిగానే అమెరికాకు రిమోట్ గా సేవలు అందించే ప్రత్యేక హక్కుకోసం కూడా సుంకం చెల్లించాల్సి ఉంటుందని ప్రముఖ వ్యాఖ్యాత జాక్ పోసోబిక్ సోషల్ మీడియా వేదిక ఎక్స్ లో పోస్ట్ చేయడంతో దేశవ్యాప్తంగా చర్చ మొ దలైంది.

ఈ విధానాన్ని అన్ని పరిశ్రమలకు వ ర్తింప జేయవచ్చునని ఆయన పేర్కొన్నారు.ఇదే పోస్ట్‌ను తర్వాత ట్రేడ్, మాన్యుఫ్యాక్చరింగ్ సీనియర్ కౌన్సెలర్ పీటర్ నవారో కూడా తిరిగి పోస్ట్ చేశారు. ఇవి వైట్ హౌస్‌లోని అత్యంత కీ లకమైన వ్యక్తుల ఆలోచనలను సూచిస్తున్నా యి. ఈ విధానాలు  టారిఫ్ తో పడే ప్రభావం ఎంత ఈ విధానాలు అమలవుతే ప్రపంచ అవుట్ సోర్సింగ్ ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపగలవు. విదేశీ రిమోట్ కార్మికులపై సుంకాలు విధించడం వల్ల అమెరికా కంపెనీలకు ఐటీ, బ్యాక్ – ఆఫీస్ సేవలను అందించే ఖర్చు పెరుగుతుంది. దీనివల్ల కంపెనీలు కాంట్రాక్టులను పునరాలోచించుకోవడానికి, ధరలు పెంచడానికీ దారితీయవచ్చు.వీటి ప్రభావం సరఫరా చైన్ ను దెబ్బతీస్తాయి. ప్రాజెక్టులు ఆలస్యం కావచ్చు. అమెరికా మార్కెట్ పై ఎక్కువగా ఆధారపడే భారతీయ కంపెనీల లాభాల మార్జిన్ తగ్గిపోయే ప్రమాదం ఉంది. భారతదేశ ఐటీ, సేవలరంగం దాని ఆర్థిక వ్యవస్థకు ఓ మూలస్థంభం. ప్రతి సంవత్సరం లక్షలాది మంది ఇంజనీరింగ్,కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్లు, ఉద్యోగ రంగంలోకి ప్రవేశిస్తున్నారు. ఐటీ , బిజినెస్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్ సంస్థలకు, స్థిరమైన బలమైన సాంకేతిక ప్రతిభ అందిస్తున్నారు.

ఇన్ఫోసిస్, టీసిఎస్, విప్రో, కాగ్నిజెంట్ హెచ్ సిఎల్ వంటి కంపెనీలు అత్యధికంగా హెచ్ -1బి వీసాలను స్పాన్సర్ చేస్తున్నాయి. ఇవి నైపుణ్యం కలిగిన కార్మికులను అమెరికాలో నియమించుకోవడానికి అనేక సంవత్సరాలుగా అనుమతిస్తున్నాయి. భారతదేశం అమెరికాకు చేసే అతిపెద్ద ఎగుమతి వస్తువులు కాదు- నిపుణులైన సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్ట్ లు, ఐటీ కన్సల్టెంట్లు విద్యార్థులు. భారతీయ ప్రధాన ఐటీ సంస్థలు చాలా కాలంగా అమెరికా డిజిటల్ రంగంలో పురోగమన ప్రయత్నాలకు కేంద్రాలుగా ఉన్నాయి. సాఫ్ట్ వేర్ అభివృద్ధి క్లౌడ్ సేవలు, పెద్ద స్థాయిలో వ్యాపార కార్యకలాపాలకు అవుట్ సోర్సింగ్ ను అందిస్తున్నాయి. భారత ఐటీ సేవా రంగంపై సుంకాలను విధించే ఏ చర్య తీసుకున్నా, ఉపాధిరంగం పైనా, భారతదేశ ఆర్థిక వ్యవస్థపైనా తీవ్ర ప్రభావమే చూపగలదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News