Sunday, August 17, 2025

శాంతి దిశగా అడుగు

- Advertisement -
- Advertisement -

అలస్కా/వాషింగ్టన్: అమెరికాలోని అలస్కాలో ట్రంప్‌పుతిన్ కీలక సమావేశం ఎలాంటి ఒప్ప దం కుదరనప్పటికీ శాంతి స్థాపనలో ఒక అడుగుముందుకు పడింది. ఏళ్ల తరబడి సాగుతున్న రష్యాఉక్రెయిన్ యుద్ధం సమసిపోయే దిశలో ఇది అత్యంత ప్రధానమైనది. శుక్రవారం నాడు అలస్కాలోని అంకోరేజ్ జాయింట్ బేస్ ఎల్మెన్‌డ్రాఫ్‌రిచర్డ్‌సన్ వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతి న్ దాదాపు రెండున్నర గంటలకుపైగా చర్చలు జరిపారు. అలస్కా భేటీ ఫలప్రదంగా సాగిందని ఇరువురు నేతలు భేటీ అనంతరం ప్రకటించారు. వైట్‌హౌస్‌కు తిరిగి వచ్చిన తరువాత ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. యుద్ధం ముగింపునకు కాల్పులు విరమణ ఓడంబడికలాంటివి కా కుండా నేరుగా శాంతి ఒప్పందానికి రావడమే దీని కి ఉత్తమమైన ముగింపు అని ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్’లో పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కాల్పుల విరమణ నిలబడే అవకాశం లేదని, తరచూ ఉల్లంఘనలకు గురయ్యే అవకాశా లే ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్ మ ళ్లీ చిచ్చు లేకుండా శాంతి ఒప్పందమే అత్యుత్తమ మార్గం అని ట్రంప్ స్పష్టం చేశారు. లక్షలాది మం ది ప్రాణాలు కాపాడే అవకాశముంటుందన్నారు. తాత్కాలిక సంధి దశ దాటిపోయిందని, పూర్తి స్థాయి శాంతితోనే పరిస్థితి సద్దుమణుగుతుందన్నా రు.

ఉక్రెయిన్, రష్యా మధ్య శాంతి స్థాపన జరుగుతుందని ఆయన పరోక్షంగా తెలిపారు. సోమవా రం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వాషింగ్టన్‌లోని ఓవల్ కార్యాలయంలో తనతో సమావేశం కాబోతున్నారని ట్రంప్ ప్రకటించారు. ఆయనతో సమగ్రరీతిలో చర్చలు ఉంటాయన్నారు. తరువాతి దశ ల్లో అవసరం అయితే తిరిగి పుతిన్ తో తన భేటీకి వీలుందని వివరించారు. ఏది ఏమైనా ఇరుపక్షాలు ముందుకు రావడంపైనే అంతా ఆధారపడి ఉందన్నారు. జెలెన్‌స్కీతోనే కాకుండా తాను కొందరు యూరోపియన్ యూనియన్ నేతలతో కూడా మాట్లాడినట్లు వెల్లడించారు. తనకు అర్థరాత్రి జెలెన్‌స్కీ నుంచి ఫోన్ వచ్చిందని చెప్పారు. నాటో నేతలు, ఇయూ ప్రతినిధులు కూడా మాట్లాడారని వివరించారు. లక్షలాది మంది ప్రాణాల రక్షణలో ఇదో కీలక దశ అవుతుందన్నారు. సమస్య పరిష్కారానికి త్రైపాక్షిక సమావేశానికి ఇంతవరకూ జెలెన్‌స్కీ పట్టుపట్టారు. ఇయూ వర్గాలు కూడా ఇదే చెప్పాయి. అయితే ట్రంప్ వేర్వేరు భేటీలకే ప్రాధాన్యత ఇచ్చారు. అమెరికా, రష్యా, ఉక్రెయిన్ నేతల త్రైపాక్షిక సమావేశం జరుగుతుందని మరోవైపు దౌత్యవర్గాలు ప్రకటించడం విశేషం.

తక్షణ ఫలితం లేకున్నా ఫలవంతం దిశగా…
రష్యా పూర్వపు ప్రాంతం అలస్కాలో కీలక సమావేశానంతరం ట్రంప్, పుతిన్‌లు తక్షణ ఒప్పందం, రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతి స్థాపన నిర్ణయాలు ఏమీ లేకుండానే వారి వారి దేశాలకు వెళ్లారు. ముందు శాంతి ఒప్పందం, యుద్ధం అంతం తరువాతనే అన్ని అని ట్రంప్ ఈ చర్చల నేపథ్యంలో పుతిన్‌కు స్పష్టం చేశారు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి ఇరువురు నేతల కీలక భేటీ జరిగింది. ట్రంప్‌తో చర్చలలో కీలకమైన అవగావహన కుదిరిందని పుతిన్ మీడియాకు తెలిపారు. చర్చలు పురోగతి దిశలో ఉన్నాయని పరోక్షంగా చెప్పారు. ఈ తరుణంలో యూరప్ దేశాలు అడ్డుతగిలే వైఖరిని మానుకుంటే మంచిదని హెచ్చరించారు. వైట్‌హౌస్‌లో ట్రంప్ తనదైన ధోరణిలో మాట్లాడుతూ ఇప్పుడు బాల్ బంతి రెండూ పుతిన్ వద్దనే ఉన్నాయని, ఆయనదే కీలక స్పందన అని వివరించారు.

యుద్ధం ఆపివేయండని ఓ వైపు రష్యా అధినేతకు ఘాటు హెచ్చరికలు వెలువరిస్తూనే ట్రంప్ మరో వైపు ఆయనను చర్చలకు సాదరంగా ఆహ్వానించారు. అలస్కాలో భేటీ తరువాత ఇరువురు నేతలు సంయుక్త విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అయితే రిపోర్టర్ల ప్రశ్నలకు జవాబులు ఇవ్వలేదు. తమ మాటలతోనే ప్రెస్‌మీట్ ముగించారు. పుతిన్‌తో చర్చలు చాలా వరకూ విజయవంతం అయ్యాయి. అయితే కొన్ని మిగిలి ఉన్నాయని తన వెంట పుతిన్ నిలబడి ఉండగా ట్రంప్ ప్రకటించారు. మిగిలిన వాటిలో చాలా వరకూ అప్రధానమైనవే. ఒకే ఒక్క అంశం అత్యంత క్లిష్టమైనది, ఇది కూడా క్రమేపీ పరిష్కారం అయి తీరుతుందని ఆయన పుతిన్‌కు అవకాశం ఇవ్వకుండా చెప్పేశారు. సుఖాంత పరిస్థితికి చేరుకుంటామని, అయితే ఇంకా చేరుకోలేదని చమత్కరించారు. పుతిన్ మాట్లాడుతూ ఈ దశలో ట్రంప్ ఓ కీలకమైన నిజాన్ని అర్థం చేసుకున్నారు. రష్యా స్వీయప్రయోజనాలు కూడా కీలకమైనవే అని ఆయన గుర్తించడం ప్రధాన విషయం అన్నారు.

ఏది ఏమైనా రష్యా, అమెరికాలు ఇప్పటి పుట తిరగేసి, సహకార అధ్యాయానికి చేరుకుంటాయని ధీమా వ్యక్తం చేశారు. ఈ దశలో పుతిన్ ట్రంప్‌ను పదేపదే కొనియాడారు. ఆయనకు సరైన ఆలోచన ఉంది. ఏది సాదించాలనేది తెలుసు. తన దేశం బాగు మరింత బాగుకోసం చిత్తశుద్దితో తపించే వ్యక్తి అని వ్యాఖ్యానించారు. ఇప్పటికీ ఆయన రష్యా ప్రయోజనాల విషయం కూడా గుర్తించడం చాలా మంచిదయిందన్నారు. 2022లో ట్రంప్ అధ్యక్షుడిగా ఉండి ఉన్నట్లయితే ఈ యుద్ధమే మొదలయ్యేది కాదన్నారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ చర్చలకు వచ్చినందుకు ధన్యవాదాలు అంటూ తిరిగి కలుద్దాం అనగానే పుతిన్ కలుగచేసుకుని ఈసారి ఇక మాస్కోలోనే అని నవ్వుతూ చెప్పారు. దీనికి ట్రంప్ స్పందిస్తూ ఇది తనకు ఆసక్తికరం అన్నారు. అలస్కా భేటీకి చేరుకున్న వెంటనే ఇద్దరు నేతలు సాదరపూర్వకంగా కరచాలనం చేసుకున్నారు. చర్చలకు ముందు పాత స్నేహితుల మాదిరిగానే ముచ్చటించుకున్నారు. ఈ క్రమంలో అలస్కాలో రష్యా అమెరికా పురాతన బంధం సుస్పష్టం అయింది.

ఇక జెలెన్‌స్కీ వంతు అంతే: ట్రంప్
పుతిన్‌తో అనుకున్న విధంగా భేటీ ముగిసింది. ఇక జెలెన్‌స్కీ వంతు వచ్చింది. శాంతి స్థాపనను కొంత దూరం వరకూ తీసుకువచ్చామని, దీనిని మజిలీకి చేర్చే బాధ్యత ఇక ఉక్రెయిన్ నేతపైనే ఉందని ట్రంప్ స్పష్టం చేశారు. ఏదో విధంగా ఆయన శాంతి కోసం ముందడుగు వేయాల్సిందే అని అలస్కా నుంచి బయలుదేరే ముందు ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వూలో తెలిపారు. సమస్య పరిష్కారం దిశలో ట్రంప్ వేర్వేరుగా పుతిన్, జెలెన్‌స్కీలతో భేటీ పద్ధతిని ఎంచుకోవడం ద్వారా తన పెద్దరికాన్ని అదే విధంగా తన దౌత్యనీతిని చాటుకునేందుకు యత్నించారు. ఉక్రెయిన్ పూర్తి స్థాయిలో రష్యా అనుకూలతను ప్రదర్శించేందుకు, నాటో కూటమిలో చేరకుండా ఉండేందుకు ట్రంప్ తన దౌత్య ఎత్తుగడలకు పదును పెట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News