Monday, May 5, 2025

మరో బాంబు పేల్చిన ట్రంప్.. విదేశాల్లో నిర్మించే చిత్రాలపై 100 శాతం టారిఫ్

- Advertisement -
- Advertisement -

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన డోనాల్డ్ ట్రంప్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విదేశి దిగుమతులపై సుంకాలను పెంచి షాకిచ్చారు. దాంతోపాటు చదువు కోసం వచ్చి అమెరికాలో ఉద్యోగం చేస్తున్న విదేశి విద్యార్థులను నిర్దాక్షిణంగా వెనక్కి పంపుతున్నారు. తాజాగా ట్రంప్ హాలీవుడ్ పై దృష్టి సారించారు. కొందరు నిర్మాతల తీరుతో హాలీవుడ్ తీవ్రంగా నష్టపోతోందని ట్రంప్‌ పేర్కొన్నారు. స్టూడియోల ప్రొడక్షన్ ను విదేశాలకు మార్చడానికి అమెరికన్ చిత్రనిర్మాతలను ఇతర దేశాలు ప్రలోభపెడుతున్నాయని ఆయన ఆరోపించారు. ఇకనుంచి విదేశాల్లో చిత్రీకరించే సినిమాలపై 100 శాతం సుంకాలు విధించనున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు.

ఆదివారం తన ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫామ్‌లో ట్రంప్ పోస్ట్ చేస్తూ.. అమెరికన్ చిత్ర పరిశ్రమను పునరుద్ధరించనున్నట్లు తెలిపారు. అమెరికాలోని చలనచిత్ర పరిశ్రమ చాలా వేగంగా నాశనమవుతుందన్నారు. మన చిత్రనిర్మాతలు, స్టూడియోలను యునైటెడ్ స్టేట్స్ నుండి దూరం చేయడానికి ఇతర దేశాలు అన్ని రకాల ప్రోత్సాహకాలను అందిస్తున్నాయని విమర్శించారు. హాలీవుడ్, USAలోని అనేక ఇతర సినీ ప్రాంతాలు నాశనమవుతున్నాయని.. ఇది ఇతర దేశాల సమిష్టి ప్రయత్నమని.. జాతీయ భద్రతకు ముప్పుగా పరిగణిస్తున్నామని పేర్కొన్నారు. అందుకే, అమెరికా వెలుపల నిర్మించే అన్ని సినిమాలపై 100 శాతం సుంకం విధించే ప్రక్రియను ప్రారంభించడానికి వాణిజ్య శాఖ, యుఎస్ వాణిజ్య ప్రతినిధి (యుఎస్‌టిఆర్) కు అధికారం ఇచ్చానని ట్రంప్ ప్రకటించారు. అయితే, విదేశాల్లో నిర్మించే అమెరికా సినిమాలపై ఈ సుంకాలు విధిస్తారా? లేక, అమెరికాలో విడుదల చేసే విదేశీ చిత్రాలపై ఈ టారిఫ్ లు విధిస్తారా? అనే దానిపై ట్రంప్ క్లారిటీ ఇవ్వలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News