Friday, August 1, 2025

భారత్-రష్యా బంధంపై ట్రంప్ విమర్శలు

- Advertisement -
- Advertisement -

భారత్-రష్యా బంధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శలు గుప్పించారు. భారత్ వస్తువులపై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించిన ట్రంప్.. భారత్-రష్యా మధ్య సన్నిహిత సంబంధాలు, అధిక వాణిజ్యం ఒప్పందాలపై తీవ్రంగా విమర్శించారు. భారత్-రష్యా లావాదేవీల గురించి తాను పట్టించుకోనని..రష్యాతో భారత్ ఏం చేస్తుందో తనకు అనవసరమని అన్నారు. అమెరికా చాలా ఎక్కువ సుంకాల కారణంగా భారత్ తో తక్కువ వ్యాపారం చేసిందని.. భారత్ సుంకాలు ప్రపంచంలో అత్యధికంగా ఉన్నాయని ట్రంప్ అన్నారు.

తన సోషల్ మీడియా ట్రూత్ వేదికగా పోస్ట్ చేస్తూ.. “భారత్ రష్యాతో ఏమి చేస్తుందో నాకు ముఖ్యం కాదు. రెండు దేశాలు కలిసి తమ ఆర్థిక వ్యవస్థలను మరింత పతనం చేసుకుంటున్నాయి. రష్యా-USA కలిసి ఎటువంటి వ్యాపారం చేయవు. దానిని అలాగే ఉంచుదాం” అని ట్రంప్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News