కాలేజీల్లో చేరేందుకు
ర్యాంకర్ల అనాసక్తి 1నుంచి 100
ర్యాంక్ వరకు సీట్లు పొందింది
ముగ్గురే 101 నుంచి వెయ్యి
ర్యాంకు వరకు వెబ్ ఆప్షన్లు
నమోదు చేసుకున్నది 184మంది
విద్యార్థులే ఐఐటిలు, ఎన్‌ఐటిలు,
ప్రముఖ ప్రైవేట్ వర్శిటీల వైపే
అత్యధికుల మొగ్గు 25 నుంచి
రెండోవిడత ఎప్‌సెట్ కౌన్సెలింగ్
షురూ 30న సీట్ల కేటాయింపు
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఎప్‌సెట్ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌లో భాగంగా ఇటీవల మొదటి విడత సీట్లు కేటాయించిన విష యం తెలిసిందే. అయితే ఇంజనీరింగ్ ఎప్‌సెట్ లో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థుల్లో చాలామంది ఈ కౌన్సెలింగ్‌కు దూరంగా ఉంటున్నారు. మొదటి విడత కౌన్సెలింగ్‌లో మొత్తం 95,256 మంది విద్యార్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరుకాగా, అందులో 94,354 మం ది విద్యార్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. రాష్ట్రంలో 172 కాలేజీల్లో 83,054 ఇం జనీరింగ్ సీట్లు అందుబాటులో ఉండగా, 77, 561 సీట్లు కేటాయించారు. ఇంజనీరింగ్ ఎప్‌సెట్‌లో ఒకటి నుంచి 100 ర్యాంకు వరకు ము గ్గరు విద్యార్థులు మాత్రమే తొలి విడతలో సీట్లు పొందారు. అలాగే 101 నుంచి 200 ర్యాంకు ఐదుగురు, 201నుంచి 500 ర్యాంకు వరకు 36 మంది విద్యార్థులు సీట్లు పొందారు. అదేవిధంగా 501 నుంచి 1000 ర్యాంకు వరకు 143 మంది,
1001 నుంచి 5000 ర్యాంకు వ రకు 2,523, 5001 నుంచి 10,000 ర్యాంకు వరకు 3,679, 10,001 నుంచి 20,000 ర్యాంకు వరకు 7,291,20,001 నుంచి 30,000 వరకు 7,149, 30,001 నుంచి 40,000 ర్యాంకు వరకు 6,814, 40,001 నుంచి 50,000 ర్యాంకు వరకు 6,330, 50,001 నుంచి 1,00,000 ర్యాంకు వరకు 25,096, 1,00,001 నుంచి 1,50,000 వరకు 17,753, 1,50,001 నుంచి చివరి ర్యాంకు వరకు 739 మంది విద్యార్థులు సీట్లు పొందారు. 200 ర్యాంకు లోపు ఉన్న విద్యార్థులు ఐదుగురు మాత్రమే ఉండగా, 500 లోను ర్యాంకు కలిగిన విద్యార్థులు 143 మంది మాత్రమే సీట్లు పొందారు. ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులు రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలు పొందడానికి ఆసక్తి కనబరచడం లేదు. వారిలో అధిక శాతం ఐఐటిలు, ఎన్‌ఐటిలు, ప్రముఖ ప్రైవేట్ యూనివర్సిటీలలో ప్రవేశాలు పొందేందుకే ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.
25 నుంచి రెండో విడత కౌన్సెలింగ్
ఎప్‌సెట్ ఇంజనీరింగ్ రెండో విడత కౌన్సెలింగ్ ఈనెల 25 నుంచి మొదలవుతుంది. ఈనెల 26న సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించి 26,27 తేదీలలో వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించారు. జులై 30న రెండో విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయించనున్నారు. ఆగస్టు 5 నుంచి తుది విడత ఇంజినీరింగ్ ప్రవేశాల ప్రక్రియ మొదలుపెడతారు. ఆగస్టు 6న సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించి 6,7 తేదీలలో తుది విడత వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. ఆగస్టు 10న ఇంజినీరింగ్ తుది విడత సీట్ల కేటాయిస్తారు. ఆగస్టు 11 నుంచి 13 వరకు కాలేజీల్లో చేరేందుకు అవకాశం కల్పించారు.