Saturday, May 24, 2025

రేపు ఉ.11 గంటలకు పాలిసెట్ ఫలితాలు విడుదల

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో పాలిటెక్నిక్ కళాశాలల్లో సీట్ల భర్తీ కోసం ఈనెల 13న నిర్వహించిన టిజి పాలిసెట్ ఫలితాలు శనివారం విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు పాలిసెట్ ఫలితాలను విడుదల చేయనున్నట్లు రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి (ఎస్‌బిటెట్) కార్యదర్శి బి.శ్రీనివాస్ ఓ ప్రకటనలో వెల్లడించారు. మాసాబ్‌ట్యాంక్‌లోని సాంకేతిక విద్యాభవన్‌లో ఈ ఫలితాలు విడుదల చేయనున్నట్లు తెలిపారు. పాలిసెట్- 2025కు మొత్తం 1,06,716 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 98,858 మంది పరీక్ష రాశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News