Saturday, May 24, 2025

పాలిసెట్ ఫలితాలు విడుదల

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో ఇంజనీరింగ్, వ్యవసాయ, ఉద్యానవన, వెటర్నరీ డిప్లొమా కోర్సుల డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన టిజి పాలిసెట్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన శనివారం పాలిసెట్ ఫలితాలను విడుదల చేశారు. ఈ పరీక్షలో మొత్తం 83, 364 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. ఫలితాలను పాలిసెట్ అధికారిక వెబ్ సైట్‌లో అందుబాటులో ఉంచామని..

విద్యార్థులు తమ ర్యాంక్ కార్డులు డౌన్ లోడ్ చేసుకోవచ్చని సూచించారు. రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీలతో పాటు వ్యవసాయ, ఉద్యానవన, వెటర్నరీ, డిప్లొమా తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈనెల 13న పాలిటెక్నికల్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పాలిసెట్ -2025) నిర్వహించిన పరీక్షకు 98,858 మంది హాజరు కాగా, వారిలో 83,364 మంది ఉత్తీర్ణత సాధించారు. ఎంపిసి విభాగంలో 81.88 శాతం, ఎంబైపిసి విభాగంలో 84.33 శాతం ఉత్తీర్ణత నమోదైందని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News