Friday, May 2, 2025

రేపటి నుంచి వెబ్‌సైట్‌లో టెన్త్ హాల్ టికెట్లు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో ఏప్రిల్ 3వ తేదీ నుంచి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో శుక్రవారం(మార్చి 24) హాల్ టికెట్లు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. విద్యార్థులు dse.telangana.gov.in వెబ్‌సైట్ నుంచి నేరుగా టెన్త్ హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకుని పరీక్షలకు హాజరుకావచ్చు. ప్రభుత్వ పరీక్ష విభాగం పాఠశాలలకు కూడా హాల్ టికెట్లు పంపిస్తుంది.

ఏప్రిల్ 3 నుంచి 13వ తేదీ వరకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పదో తరగతి పరీక్షలు జరుగనున్నాయి. ఈ పరీక్షల రాష్ట్రవ్యాప్తంగా 2,652 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. టెన్త్ పరీక్షలకు 4,94,616 మంది విద్యార్థులు హాజరుకానున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News