Tuesday, July 22, 2025

రేపు ఉ.11 గంటలకు టెట్ ఫలితాలు

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టిజి టెట్ 2025) ఫలితాలు మంగళవారం విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా టెట్ ఫలితాలను విడుదల చేయనున్నారు. జూన్ 18 నుంచి 30వ తేదీ వరకు ఆన్‌లైన్ విధానంలో టెట్ పరీక్షలు జరిగాయి. ఈనెల 5వ తేదీన టెట్ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీ విడుదల చేసి, అభ్యంతరాలు స్వీకరించారు. మంగళవారం తుది కీతో పాటు ఫలితాలు విడుదల చేయనున్నారు. పేపర్ 1కు 63,261 మంది దరఖాస్తు చేసుకోగా, 47,224 మంది(74.65 శాతం) హాజరయ్యారు. అలాగే పేపర్ 2(మ్యాథ్స్ అండ్ సైన్స్)కు 66,686 మందికి గానూ 48,998 మంది(73.48) హాజరు కాగా, పేపర్ 2(సోషల్ స్టడీస్)కు 53,706 మందికిగానూ 41,207 మంది(76.73 శాతం) మంది హాజరైనట్లు అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News