- Advertisement -
రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టిజి టెట్ 2025) పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీ విడుదలైంది. ప్రాథమిక కీ లపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే అభ్యర్థులు ఈ నెల 8వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో అభ్యంతరాలు సమర్పించవచ్చని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలస్ పేర్కొన్నారు. ఈనెల 18 నుంచి 30వ తేదీ వరకు ఆన్‌లైన్ విధానంలో టెట్ పరీక్షలు జరిగాయి. పేపర్ 1కు 63,261 మంది దరఖాస్తు చేసుకోగా, 47,224 మంది(74.65 శాతం) హాజరయ్యారు. అలాగే పేపర్ 2(మ్యాథ్స్ అండ్ సైన్స్)కు 66,686 మందికి గానూ 48,998 మంది(73.48) హాజరు కాగా, పేపర్ 2(సోషల్ స్టడీస్)కు 53,706 మందికిగానూ 41,207 మంది(76.73 శాతం) మంది హాజరైనట్లు అధికారులు తెలిపారు.
- Advertisement -