రష్యాలో భారీ భూకంపం సంభవించింది. రష్యా తూర్పు ప్రాంతంలోని కమ్చట్కాలో ద్వీపకల్పంలో ఆదివారం 7.4 తీవ్రతతో భూకంపం సంభవించిందని భూకంప పర్యవేక్షణ సంస్థలు తెలిపాయి. దీనికి కొన్ని నిమిషాల ముందు రిక్టర్ స్కేలుపై 6.6, 6.7 తీవ్రతలతో జంట భూకంపాలు సంభించినట్లు తెలిపాయి. ద్వీపకల్పంలో రెండు భూకంపాలు సంభవించిన నేపథ్యంలో పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం ఆ ప్రాంతానికి సునామీ హెచ్చరికలను జారీ చేసింది. రెండో భూకంపం పెట్రోపావ్లోవ్స్క్-కమ్చట్స్కీ నగరానికి తూర్పున 144 కిలోమీటర్ల దూరంలో 20 కిలోమీటర్ల లోతులో ఉందని యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. కమ్చట్కా తీరానికి సమీపంలో సంభవించిన భూకంపాల 10 కిలోమీటర్ల లోతులో గుర్తించింది. ఈ భూకంపాల వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్థి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. సునామీ హెచ్చరికల నేపథ్యంలో తీరం సమీప ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
రష్యాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
- Advertisement -
- Advertisement -
- Advertisement -