Thursday, May 15, 2025

పాక్ కు టర్కీ సాయం

- Advertisement -
- Advertisement -

ఆపరేషన్ సిందూర జరిగీ జరగకముందే టర్కీకి చెందిన అత్యంత అధునాతన శక్తివంతమైన యుద్ధనౌక ఒకటి వచ్చి పాకిస్థాన్ కరాచీ రేవులో లంగరు వేసుకు నిలిచింది. ఇక భారతదేశానికి వ్యతిరేకంగా పాక్ సైన్యం సాగించిన దాడులకు వెనుక ఉండి ఈ ఇస్తాంబుల్ వాలా టర్కీ నేత ఎర్డోగాన్ అదేపనిగా సైనిక సాయానికి అర్రులుసాచాడు. ఆయనకు ఏ క్షణంలో భారత్ పట్ల ఆగ్రహం అంతకు మించిన అక్కసు నెలకొందో తెలియక విశ్లేషకులు తల్లడిల్లారు. ఇటీవల భారతీయ సైనిక బలగాలు ప్రయోగించిన అనేక క్షిపణులు నేలకూల్చిన డ్రోన్లలో అత్యధిక సంఖ్యలో టర్కీ డ్రోన్లు ఉండటం కీలకం అయింది. సాంకేతిక పరిజ్ఞానం సాధనాసంపత్తి ఏ మేరకు ఉందో తెలియదు కానీ టర్కీ విరివిగా పంపిన డ్రోన్లు అనేకం పతనం చెందాయి. పలు చోట్ల వీటి అవశేషాలు వెలుగులోకి వచ్చాయి. డ్రోన్లనే కాకుండా టర్కీవాలాలు వీటిని నడిపే నిర్వాహకులు ఛోదకులు ఇతర సాంకేతిక సిబ్బందిని

కూడా తమ మిత్రదేశానికి తరలించి తాము సైతం ఈ భారత్‌పై యుద్ధంలో అని చాటుకోవడం ఇప్పుడు టర్కీ నేత కు భారత్ పట్ల నిండుకుని ఉన్న పరిపూర్ణ విద్వేషానికి ప్రతీక అయింది. 350కు పైగా డ్రోన్లను పాకిస్థాన్‌కు టర్కీ తరలించినట్లు గుర్తించారు. టర్కీ డ్రోన్ల శకలాల ఫోటోలను ఇప్పుడు భారతీయ సైన్యం అధికారికంగా మీడియాకు పంపించింది. ఏ వేదికపై అవకాశం దక్కినా భారత్‌కు వ్యతిరేకంగా నిందలు దిగడం, కశ్మీర్ పాక్ హక్కు అని చెప్పడం ఎర్డోగావ్ మిత్రకృత్యంఅయింది. ఇందులో భాగంగానే డ్రోన్లను పంపించారు. ఈ డ్రోన్లను తీసుకుని పాక్ వైమానిక బలగాలు భారతీయ భూభాగంపైకి దాడులకు తెగబడింది.ఇక ముగ్గురు నలుగురు టర్కీ వాలాలు కూడా డ్రోన్ల ఆపరేటర్లుగా ఉండి, భారత్ దెబ్బకు బలి అయ్యారు. పాకిస్థాన్ టర్కీ నుంచి బైరక్తర్ టిబి 2, ఇహా డ్రోన్లను పంపించింది. ఈ డ్రోన్లు దూర ప్రాంతాలకు చొచ్చుకువెళ్లగలవు. ప్రత్యేకించి భారతీయ సైనిక స్థావరాలను దెబ్బతీసేందుకు, లేదా అయోమయం సృష్టించేందుకు, సైనిక బృందాలకు సరఫరాల నిలిపివేతకు వాడతారని వెల్లడైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News