Friday, August 29, 2025

టివి నటుడు లోబోకు జైలుశిక్ష

- Advertisement -
- Advertisement -

జనగాం: కారు నడుపుతూ ఇద్దరు మృతికి కారణమైన టివి నటుడు లోబోకు సంవత్సరం పాటు జనగామ జైలు శిక్ష విధించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నటుడు లోబో తన టివి సిబ్బందితో కలిసి రామప్ప, లక్నవరం, భద్రకాళి చెరువు, వేయి స్తంభాల ఆలయంలో చిత్రీకరణ పూర్తి చేసికొని కారులో వరంగల్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్నారు. రఘునాథపల్లి మండలం నిడిగొండ సమీపంలో ఎదురుగా వచ్చిన ఆటోను లోబో నడిపిస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో ఘటనా స్థలంలోనే ఇద్దరు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఇద్దరు మృతికి కారణమైన లోబోకు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.12500 జరిమానా జనగాం కోర్టు విధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News