హైదరాబాద్: కార్మికుల చట్టాలకు విరుద్ధంగా పార్టీ కార్యాలయంలో ఎన్నిక నిర్వహించారని ఎంఎల్‌సి కవిత విమర్శలు గుప్పించారు. రాజకీయ కారణాలతోనే ఈ ఎన్నిక జరిగిందని మండిపడ్డారు. సింగరేణి బొగ్గుగని కార్మికులకు ఎంఎల్‌సి కవిత బహిరంగ లేఖ రాశారు. టివిజికెఎస్ అధ్యక్షుడిగా ఎన్నకైన కొప్పుల ఈశ్వర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. తాను అమెరికాలో ఉన్న సమయంలో అధ్యక్ష ఎన్నిక జరిగిందని, చట్టవిరుద్ధంగా టివిజీకెఎస్ సమావేశం నిర్వహించి ఎన్నుకున్నారని ధ్వజమెత్తారు. సింగరేణి కార్మికుల కోసం పోరాడుతుంటే తనపై కుట్రలు పన్నుతున్నారని, బిఆర్ఎస్లో జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలుసునని, తన తండ్రికి రాసిన లేఖను తాను అమెరికా వెళ్లినప్పుడ లీక్ చేశారని దుయ్యబట్టారు. తనపై కుట్రలకు పాల్పడుతున్నవారిని బయటపెట్టాలని తాను కోరితే తనపైనే కక్షకట్టారని కవిత ధ్వజమెత్తారు. ఈ కుట్రదారులే తనని వివిధ రూపాల్లో వేధింపులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆ ఎన్నికలు చట్టవిరుద్ధంగా జరిగాయి: కవిత
- Advertisement -
- Advertisement -
- Advertisement -