Thursday, August 21, 2025

నాది ఒంటరి పోరు..సింహం టైప్: టివికె నేత, హీరో విజయ్

- Advertisement -
- Advertisement -

తమిళనాడులో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోతమ తమిళగ వెట్టి కజగం (టివికె) ఒంటరిపోరుకు దిగుతుందని హీరో విజయ్ చెప్పారు. తమకు భావజాల ప్రత్యర్థి బిజెపి, అయితే రాజకీయ ప్రదాన శత్రువు డిఎంకె అవుతుందని, మొత్తం మీద టివికె, డిఎంకె మధ్యనే పోటీ ఉంటుందని ఆయన గురువారం ఇక్కడ చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాక సభ రీతిలో ఆయన ఇక్కడ పార్టీ రెండవ రాష్ట్ర స్థాయి సదస్సు సందర్భంగా ఏర్పాటు అయిన సభలో మాట్లాడారు. ఇక్కడ సాయంత్రం జరిగిన సభకు పెద్ద పెట్టున జనం తరలివచ్చారు. తాను మధురై ఈస్ట్ స్థానం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తానని, అయితే ఇతర స్థానాల్లో కూడా తననే టివికె తరఫున అభ్యర్థిగా భావించి గెలిపించాలని పిలుపు నిచ్చారు. తాను సభలకు పరిమితం అయ్యే వ్యక్తిని కాదని, తమిళనాట ప్రతి ఇంటి తలుపు తడుతానని ప్రకటించారు. సింహం సింహమే గుంపుగా వెళ్లదని తమిళంలో డైలాగ్ చెప్పారు. ఇతర పార్టీలతో పొత్తు ఉండదు. కూటమిగా సాగేది లేదని, ఇప్పటికే తాము తమిళుల ప్రయోజనాల కోణంలో అనేక అంశాలపై పోరు సల్పినట్లు వెల్లడించారు.

టివికెకు ఎవరి భయం లేదు. ఎటువంటి లోగుట్టు మాఫియా వ్యవహారాలు లేవన్నారు. కులం, మతం వర్గం తేడా లేకుండా మొత్తం తమిళనాడు కలిసికట్టు శక్తి తనకు సంతరించి తీరుతుందన్నారు. అంతాకలిసిఫాసిస్టు బిజెపి, విషపూరిత డిఎంకెపై తిరుగబడుదాం అని తీవ్రస్థాయిలో పిలుపు నిచ్చారు. ఆయన హావభావాలతో తరలివచ్చిన ఫ్యాన్స్ కేరింతలు మిన్నంటాయి. బానిసల జట్టులో చేరాల్సిన అవసరం తనకు లేదని, తనది నిస్వార్థ ఏక పక్షం అని అన్నారు. ఇది పూర్తి స్థాయిలో స్వీయ గౌరవం, మేళవించుకుని సాగే పక్షంగా ఉంటుందన్నారు. ప్రధాని మోడీపై ఆయన నేరుగా విరుచుకుపడ్డారు. ఆయన హయాంలో తమిళనాడు ప్రయోజనాలకు గండిపడిందన్నారు. తమిళులకు అవసరం అయినది ఏమైనా చేశారా? ఆర్‌ఎస్‌ఎస్ పాటపాడే వారికి వంతపాడుతున్నారు. 2029 వరకూ తిరుగులేదని మోడీ అనుకుంటున్నారు. అయితే కమల పత్రాలపై మెరిసే నీటి బిందువులు జారిపోకుండా పదిలమై ఉండటం జరగదన్నారు. తమిళులు మోడీకి దాసోహం అనడం జరగదన్నారు. శ్రీలంక నుంచి కచ్చదీవులకు విముక్తి కల్పిస్తామన్నారు.

అధికార డిఎంకె హయాంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, అనేక విషయాలు తొక్కిపడేస్తున్నారని స్టాలిన్‌పై ఈ హీరో విరుచుకుపడ్డారు. ఏదో ఒక కారణంతో ఇటీవలి కాలంలో స్టాలిన్ తరచూ మోడీతో రహస్య మంతనాలకు దిగుతున్నారని , ఈ విషయాలు తాను త్వరలో వెలుగులోకి తెస్తానని , తమిళులు రాజకీయ కుట్రల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. ఇప్పటి రాజకీయ పార్టీలు కేవలం సొంత స్వార్థపు జాతకాలతో సాగుతున్నాయి. అయితే వీటికి అతీతంగా వినూత్న పంధాలో సాగేది టివికె అని, ఇది తమిళ ప్రయోజనాలను దెబ్బతీసే వారిపై పంజా విసురుతుందని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News