Monday, September 15, 2025

కొండరాళ్లు విరిగిపడి ఇద్దరు ఆర్మీ అధికారుల దుర్మరణం

- Advertisement -
- Advertisement -

తూర్పు లడాఖ్ ప్రాంతంలో ఇద్దరు సైనిక అధికారులు విషాదాంతం చెందారు. బుథవారం వారు ప్రయాణిస్తున్న వాహనంపై భారీ కొండరాళ్లు విరిగిపడ్డాయి. ఈ దుర్ఘటన లేహ్‌కు 200 కిలో మీటర్ల దూరంలోని మారుమూల ప్రాంతంలో జరిగింది. ప్రమాదంలో మృతి చెందిన వారిని లెఫ్టినెంట్ కల్నల్‌భాను ప్రసాద్ సింగ్ మంకోటియా, లాన్స్ దఫదార్ దల్జీత్ సింగ్ గా గుర్తించారు మేజర్ మయానక్ శుభం, మరికొందరు అధికారులు గాయపడ్డారని వెల్లడైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News